మెదక్

రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, మార్చి 24: రామాయంపేట ప్రజల చిరకాల స్వప్నమైన రెవె న్యూ డివిజన్ కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చాలని కాంగ్రెస్ నాయకులు శనివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాల్లో డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రబాత్‌రావు అద్వర్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేశా రు. గతంలో ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో మంత్రి హరీష్‌రావు హామీ మేరకు విరమించామని, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలోని పరకాలను డివిజన్ కేంద్రంగా చేస్తు ఫైల్‌పై అసెంబ్లీ సాక్షిగా సంతకం చేసినందున రామాయంపేటను డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిదర్‌రెడ్డి అద్వర్యంలో కాంగ్రేస్ నాయకులు తహశీల్దార్ జంగేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా శశిదర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో రామాయంపేటను డివిజన్ కేంద్రం చేయాలని ఈప్రాంత ప్రజలు, అఖిలపక్ష నాయకులు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల అద్వర్యంలో 182రోజుల రిలేదీక్షలు, నిరసన కార్యక్రమాలు చే యడం జరిగిందన్నారు. అప్పట్లో మంత్రి హామీతో దీక్షలు విరమించిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. మంత్రి హరీష్‌రావు మాటకు కట్టుబడి రామాయంపేటను డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. స్థానిక శాసనసభ్యురాలు, ఉపసభాపతి చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 3వ తేదీలోగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మరో ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి, వ్యాపార వర్గాలతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామిన తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మెన్ అమరసేనారెడ్డి, మాజీ ఎంపీటీసీ హైమద్, బ్లాక్ కాంగ్రేస్ అద్యక్షులు రొయ్యల పోచయ్య, కాంగ్రేస్ నాయకులు చింతల యాదగిరి, విప్లవ్‌కుమార్, రాకేష్, షోబోద్దీన్, గొల్లరమేష్, అంజద్, అబ్రమైన గంగరాములు, అల్లాడి వెంకటి, హన్మంతరావు, శ్యాంరెడ్డి, దోమకొండ యాదగిరితో పాటు తదితరులు ఉన్నారు.

క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వద్దు
*సరైన చికిత్సతో వ్యాధికి కళ్లెం: కలెక్టర్
సంగారెడ్డి టౌన్, మార్చి 24: క్షయ వ్యాధిపై రోగులు నిర్లక్ష్యం చేయకూడదని, క్రమం తప్పకుండ మందులు వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహాన ర్యాలీని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు భయందోళనకు గురికాకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తూ తగిన వైద్య చికిత్సలు పొందాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత వైద్య చికిత్సలు అందిస్తుందన్నారు. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్ మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహాన పెంచేలా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రస్తుతం జిల్లాలో 1100మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వీరందరికీ తగిన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాధికారక బ్యాక్టీరియా గాలిలోకి వ్యాప్తించి ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆలసి పోవడం, రాత్రిళ్లు చమటలు పట్టడం, బరువుతగ్గడం వంటి ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ నాగరాజ్‌గౌడ్, జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు వైద్యులు, ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.