క్రైమ్/లీగల్

వివాహిత హత్య.. ఆపై దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 29: మెదక్ పట్టణానికి చెందిన ఒక వివాహితను హత్య చేసి, అనంతరం దహనం చే శారు. మృత దేహాన్ని ద్వారకా గార్డెన్ ఎదురుగా బాబా కాలనీలో పడేశారు. పూర్తిగా కాలి ఉన్న స్థితిలో ఉన్న ఒక మహిళ శవాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. మృతురాలిని పట్టణానికి చెందిన హేమలత (24)గా గుర్తిం చారు. ఆమెను ఎక్కడో హత్య చేసి అనంతరం దహనం చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద ఉన్న ఒక బ్యాగ్, సెల్‌ఫోన్, పేపర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ భాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకొని భర్త సతీష్‌తో విచారించారు. భర్త సతీష్ స్థానికి సాయిదీప్‌లో పనిచేస్తున్నాడు. మెదక్ పట్టణం కుమ్మరిగడ్డలో సతీష్ 2013 మే నెలలో చందంపేట గ్రామానికి చెందిన హేమలతను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం జరిగిన వెంటనే నెల రోజులకే వేరే కాపురం పెట్టుకున్నారు. ఈ ఇరువురికి అనిరుద్ అనే కుమారుడు ఉన్నాడు. 2018 జనవరిలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగగా, ఆమె కుమారుడు అఖిల్‌ను అత్తమామల వద్ద వదిలిపెట్టి హేమలత తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఏప్రిల్ 24న అత్తమామలపైన మెదక్ ఎస్ప కార్యాలయంలో కేసు పెట్టింది. భర్తకు మూర్ఛ రోగం ఉందని అది దాచి తనతో పెళ్లి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కూడా హేమలత భర్తపై, అత్తమామలపై కేసు పెట్టింది. జిల్లా ఎస్పీ చందనాదీప్తి సంఘటనా స్థలానికి చేరుకుంది. హేమలత మృతదేహాన్ని పరిశీలించారు. హేమలత హత్యకు గురైందని, ఆ తరువాత ఆమెకు కాల్చి ఈ ప్రదేశంలో వదిలారని జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో జరగలేదని ఆమె స్పష్టం చేశారు. ఎక్కడో హత్య చేసి హేమలతను కాల్చిన తరువాత ఆ శవాన్ని ఇక్కడ పడవేశారని తెలిపారు. మరణించిన మహిళను హేమలతగా అత్తమామలు గుర్తించారని ఎస్పీ వెల్లడించారు. 302 ఐపీసీ కింద కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వేగవంతంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుంటామని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు.