మెదక్

లాకౌట్ ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 24: బీడి కంపెనీల లాకౌట్‌ను ఎత్తివేయాలని బీడి, సిగరేట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోపాలస్వామి డిమాండ్ చేశారు. బీడి, సిగరేట్ చట్టానికి జివో 727ను సవరణ చేయడంతో యజమాన్యాలు కార్మికుల ఉపాధిని పరిగణలోకి తీసుకోకుండ ఏకపక్షంగా కంపెనీలను మూసివేస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో 7లక్షల మంది బీడి కార్మికుల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించిందని, 727 జివోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కరువుతో పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకోవాల్సింది పోయి జివోల పేరుతో యాజమాన్యాలకు వత్తాసు పలకడం ఎంత వరకు సమంజసమన్నారు. వెయ్యి బీడిలకు 14 రూపాయల 42పైసల సెస్ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందులో 10శాతం కూడా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదన్నారు. బీడి, సిగరేట్ పెట్టలపై పుర్రెగుర్తు సైజ్‌ను తగ్గించాలని, కార్మికులు ఉపాధి కోల్పోకుండ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.