క్రైమ్/లీగల్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట/గజ్వేల్, ఏప్రిల్ 3: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అందోల్ మండలం దానంపల్లి గ్రామశివారులో తుఫాన్ వాహనం అతివేగంగా వచ్చి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో కడపల్ గ్రామానికి చెందిన అంబవ్వ(35), శంకరంపేట మండలం బూర్గుపల్లి చంద్రనాయక్ తండాకు చెందిన సర్దార్(33)లు మృతి చెందారు. మరో ఘటన గజ్వేల్ మండలం అహ్మదీపూర్ సమీపంలో చోటుచేసుకుంది. తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన కొమ్ము వెంకటేశ్(21) రోడ్డుపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, గజ్వేల్‌లో ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన సంఘ్టనతో స్థానికులు కన్నీటీ పఠ్యంతమయ్యారు. సుమారు 2గంటల పాటు బాదితులు దర్నా, రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్తతకు దారి తీయగా, గజ్వేల్ సీఐ ప్రసాద్, రూరల్ సీఐ శివలింగంల నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారికి నచ్చజెప్పారు.

యువకుడి దారుణ హత్య
మెదక్ రూరల్, ఏప్రిల్ 3: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఖాజిపల్లి శివారులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాకు చెందిన ఎండి. గఫార్‌ఖాన్, ఆసియాల రెండవ కుమారుడు ఎండి.మోయిన్‌ఖాన్ (22) ఒక కేసులో కోర్టులో హాజరయ్యేందుకు సోమవారం రోజు మెదక్ వచ్చాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున ఖాజిపల్లి శివారులో విచక్షణరహితంగా కత్తితో పొడిచి, బండరాయితో బాది హత్యచేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.