క్రైమ్/లీగల్

కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు డిబార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 19: సిద్ధిపేట జిల్లా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.రవికాంత్ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలను, బాలికల ఉన్నత పాఠశాలను, ఇందిరనగర్ ఉన్నత పాఠశాలను,ప్రభుత్వ ఉన్నతపాఠశాలను ఆయన అకస్మీకంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్లడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా చేర్యాలలోని టీఎస్‌డబ్లుఎస్ పాఠశాలలో ప్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్న ముగ్గురు విద్యార్థులను కాపీ చేస్తుండగా పట్టుకుని డిబారు చేశారు. కాగా జిల్లా ఓపెన్ టెన్త్‌లో 1302 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1171 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే 131 విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్‌లో 84మందికి 77మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. 7గురు విద్యార్థులు గైర్హాజరైనారు.
డీసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
అభ్యర్థులు ఈ నెల 21నుండి మే 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఇంటర్ పాసైనా అభ్యర్థులు డీఈఈ సెట్, ప్రీ స్కూల్ కోసం , దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ విద్యాశాఖ వెబ్ సైట్ అన్‌లైన్ విధానం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పరీక్ష తేదీ తర్వాత ప్రకటించడం జరుగుతుందని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.