మెదక్

ఐనోల్,నాగాపూర్ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 20: గ్రామ స్వరాజ్ పథకం కింద జిల్లాలో ఏంపికైన రెండు గ్రామాల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న (7) కార్యక్రమాలు వంద శాతం అమలు కావాలని కేంద్ర బృందం అధికారి నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర బృందం అధికారులు జిల్లాలో ఎంపికైన ఐనోల్, నాగాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి మండలం నాగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలను గ్రామ స్వరాజ్ అభియాన్ అంటే ఏమిటి, అందులో ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్న విషయం తెలుసా అని నాగిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ఉజాల స్కీం, జన్‌ధన్ యోజన, సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమాలతో చేకూరుతున్న లబ్ధి గురించి ఆయన వివరించారు. ఆయా శాఖ అధికారులు తమ వద్దకే వచ్చి అన్ని వివరాలు సేకరించి, బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిపించడం, అందరికి బీమాను చేయించడం, గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు లేని వారికి ధరఖాస్తులు తీసుకొని వెంటనే ఇస్తున్నట్లు తెలిపారు. ఎల్‌ఈడి బల్పులు, 0-5సంవత్సరాల చిన్నారులకు, గర్భిణి స్ర్తిలకు రోగ నిరోధక శక్తి పెరిగేలా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్వరాజ్ అభియాన్‌లో అమలు చేస్తున్న 7కార్యక్రామాలలో గ్రామంలో ఎవరికి ఏది కావాలో అది అందించడం జరుగుతుందన్నారు. ఇందులో ఏమైన ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ స్వరాజ్ అభియాన్‌లో అర్హులందరూ లబ్ధిపొందాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన వారందరూ ఈ 7 కార్యక్రమాలలో లబ్ధిపొందవచ్చన్నారు. మే 5లోపు ఈ కార్యక్రమాలు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో గుర్తించిన లబ్ధిదారులకు బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటిఎం కార్డులు పంపిణీ చేశారు. విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన గృహాలను పరిశీలించడంతో పాటు ఎల్‌ఈడి బల్పులు అందజేశారు.