మెదక్

గొల్లభామ చీరలకు పేటెంట్ హక్కు సిద్దిపేటదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 24 : గొల్లభామ చీరలు సిద్దిపేటకు కీర్తికిరిటమై నిలిచాయని, ఈ చీరల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చేనేత, హైండ్లూమ్స్ కమిషనర్ శైలజరామయ్యర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో వెంకట్‌రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా చేనేత అభివృద్ధి చర్యల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజరామయ్యర్ మాట్లాడుతూ చేనేత చీరలను హైండ్లూమ్ ద్వారానే నేయాలని, పవర్‌లూమ్ వాడరాదని, పవర్‌లూమ్ నేసినచో 1985 హైండ్లూమ్ ప్రొటేక్షన్ ఆక్టు ప్రకారం ఏలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేసే హక్కు ఈ చట్టానికి ఉందన్నారు. తరతరాల వారసత్వ సంస్కృతిగా గొల్లభామ చీర భాసిల్లుతుందని, ప్రస్తుతం ఆ చీరల ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఎవరైనా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ చీరను నేసే హక్కు లేదని, భౌగోళిక జియోగ్రాఫిక్ ఆక్టు ప్రకారం ఈ చీర సిద్దిపేట ప్రాంతానికి చెందుతుందన్నారు. ఈ ప్రాంత చేనేతలకు మాత్రమే ఇవి నేసే హక్కుందని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ రెండు చట్టాలను ఉల్లంఘిస్తే వారికి 500నుంచి ఆ పైవరకు జరిమానా, 6నెలల నుంచి 10ఏండ్ల జైలుశిక్ష విధిస్తారన్నారు. చేనేతల అభివృద్ధికి కావాల్సిన ఆకృతులను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఏపిలోని చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అక్కడ నేస్తున్న విధానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 28న సిద్దిపేటకు చెందిన 5గురు చేనేతలు బృందంగా సందర్శించి పరిశీలన చేస్తారన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్షాన సిద్దిపేటలో క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన ప్రపోసల్ పంపడం జరిగిందని కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. దుబ్బాక, సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్ ప్రాంతాల నుంచి మరింతమంది చేనేతలకు ఉపాధి కల్పన దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్‌రావు సహకారంతో మరిన్ని సంస్కరణలు తేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి హిమజ, ఆర్‌ఆర్‌డి త్రిమూర్తికుమార్, హైండ్లూమ్ ఏడి వెంకటేశ్వర్‌రావు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.