మెదక్

ఇచ్చిన హామీలు చాలు.. వేతనాలు పెంచండీ: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 26: మున్సిపల్ కార్మికులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామిలు చాలని, ఇకపై వేతనాలు పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.జయరాజు డిమాండ్ చేసారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మె రెండవ రోజుకు చేరుకున్న సందర్భంగా సీపీఎం జిల్లా కమిటి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను హామిలతో మోసం చేయకూడదన్నారు. వేతనాలు పెంచేంత వరకు సమ్మె విరమించకూడదని కార్మికులను కోరారు. సీపీఎం పార్టీ ఎప్పుడు కార్మిక వర్గానికి అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. కార్మికులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. వేతనాల పెంపు జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కోశాధికారి యాదవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు, సీఐటీయు పట్టణ అధ్యక్షులు మహబూబ్, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు దశరత్, సువర్ణ, గోపాల్, చంద్రయ్య, వేణు, రాజు, రాములు, బాల్‌రాజ్, లక్ష్మీ, లావణ్య, మంజుల, సునంద తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో వైన్ షాపుల్లో తనిఖీ
మెదక్, ఏప్రిల్ 26: మెదక్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ షఫీ వైన్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. పాత బస్టాండ్‌లో ఉన్న తాళ్లపల్లి వైన్స్, జీకెఆర్ తదితర వైన్ షాపులను ఆయన తనిఖీలు చేశారు. ప్రతి వైన్ షాపులో ధరల పట్టికల బోర్డులు ఉన్నాయా లేవా అనేది పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎంఆర్‌పీ ధరల ప్రకారం వైన్స్, బీర్లు అమ్ముతున్నరా లేరా అనే దానిపై తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వైన్స్‌లో ఎంఆర్‌పీ ధరలతో అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వేసవిలో మాత్రం బీర్లు అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రజలకు ఎక్కడ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సమయ పాలన ప్రకారం వైన్స్ దుకాణాలు తెరవడం, మూసివేయడం పరిశీలించినట్లు తెలిపారు.