మెదక్

ఫుట్‌పాత్ అక్రమణలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 26: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారులకు ఇరువైపుల ఆక్రమణలు చేసి నిర్మించుకున్న చిరు వ్యాపార కొట్లను మున్సిపల్ అధికారులు తొలగింపుకు ఉపక్రమించి ట్రాఫిక్ తిప్పలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకే మున్సిపల్ అధికారులు, సిబ్బంది జేసీబీలతో కొత్త బస్టాండ్ వద్దకు చేరుకుని రోడ్డు ప్రక్కన ఉన్న డబ్బాలు, కిల్లీ కొట్లను తొలగించడానికి శ్రీకారం చుట్టారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మొహరించారు. ఆక్రమణలను తొలగించడానికి ముందుగానే ఆయా వ్యాపారులకు పురపాలక సంఘం అధికారులు నోటీసులు జారీ చేసి, దుకాణాల్లో ఉన్న విలువైన వస్తువులను తీసుకువెళ్లాలని సూచించారు. కాగా తాము రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ వ్యాపారాలను కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఉన్నఫలంగా తమ దుకాణాలను తొలగించి రోడ్డున పడవేస్తున్నారని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు మున్సిపల్ కమీషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచనల మేరకు హైదరాబాద్-నాందేడ్-అకోల ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న డబ్బాలను తొలగింపజేసారు. డబ్బాలను తొలగించిన ప్రాంతంలో పుట్‌పాత్ నిర్మాణం చేపట్టారు. ఇటీవల పోతిరెడ్డిపల్లి నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్రధాన రహదారి మద్యలో డివైడర్‌ను నిర్మించారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారిపోయి తరుచూ ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాకుండా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పట్టణంలోని ఆయా ప్రధాన రహదారుల వెంట ప్రయాణించి పరిస్థితిని గమనించారు. ఈ మేరకు హైదరాబాద్-అకోల రహదారికి ఇరుప్రక్కల అక్రమంగా వెలసిన పుట్‌పాత్ దుకాణాలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అదేసాల ప్రకారంగా అధికారులు కిల్లీ కొట్లు, పూల దుకాణాలు, ఇతర చిరు వ్యాపార సంస్థలను తొలగించడానికి ఉపక్రమించారు. మున్సిపల్ అధికారుల అనాలోచిత చర్యల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని బాధితులు వాపోతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకునప్పుడు తాము ఉపాధి కోల్పోకుండా కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యతలను స్వీకరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా గతంలో డబ్బాలను తొలగించి పుట్‌పాత్ నిర్మించినా ఏలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. పాదచారుల కోసం నిర్మించిన పుట్‌పాత్‌పై తిరిగి చిరు వ్యాపారులు తోపుడు బండ్లను పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తుండటంతో ఎక్కడి సమస్య అక్కడే అన్నట్లుగా తయారైందని పాదచారులు పెదవి విరుస్తున్నారు. అధికారులు పక్షపాత దోరణిని అవలంభిస్తున్నారని, పాత బస్టాండ్ ప్రాంతంలో రాకపోకల సమస్య తీవ్రంగా ఉన్న అక్కడ మాత్రం ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేకూర్చాలని బాధితులు కోరుతున్నారు.