మెదక్

యజ్ఞయాగాదులు, క్రతువులు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 26: హిందూ ధర్మ సంస్కృతిలో యజ్ఞయాగాదులు, క్రతువులు అత్యంత కీలకమని, సనాతన ధర్మ పరిరక్షణలో ఆద్యాత్మిక వేత్తలు, సాదుసంతులు, పుణ్యక్షేత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం మాచిన్‌పల్లి శ్రీ సీతారామ క్షేత్రం వద్ద నిర్వహిస్తున్న శ్రీ సుదర్శన మహాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. క్రతువులలో ఎంతో విశిష్టత కలిగిన శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించడం ద్వారా దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ముఖ్యంగా విశ్వశాంతి, లోకకళ్యాణార్థమై నిర్వాహకులు ఆకుల రాజయ్య, గిరీష్‌రెడ్డిలు చేపట్టిన మహా సంకల్పం మంచి ఫలితాలు ఇస్తుందని ఆకాంక్షించారు. అలాగే యాగ ఫలితంగా ప్రధాని నరేంద్రమోడికి సైతం ఎంతో భలం చేకూర్చనుండగా, శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దేశం ఎదుర్కొంటున్న వివిద సమస్యలు, సవాళ్ళను యాగభలంతో ప్రధాని నరేంద్రమోడి తిప్పికొట్టనుండగా, ప్రపంచ వ్యాప్తంగా నరేంద్రమోడి పాలనకు హర్షమోదాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ చేపడుతున్న ప్రజా, రైతు సంక్షేమ పథకాలు పేదలకు చేరే విదంగా శ్రేణులు దృష్టి సారించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో హరిద్వార్ పీఠాధిపతి శ్రీ గరుడానంద తీర్థ స్వామీజి, జిల్లా బీజేపీ అధ్యక్షులు నరోత్తంరెడ్డి, యజ్ఞాచార్యులు కిషోరస్వామి, నాయకులు ఎల్లు రాంరెడ్డి, పేర్ల శ్రీనివాస్, ఉప్పల మదుసూదన్, కుడిక్యాల రాములు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.