మెదక్

మేలుకొలుపు..శాంతికి పిలుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 26: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహా పురుషులవుతారు అన్న సూక్తిని ఆదర్శంగా తీసుకున్న మెదక్ పోలీసులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయడంలో మరో ముందడుగు వేసారు. వివిధ కారణాలతో గ్రామాలు, కుటుంబాలు, జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారిలో మార్పు తీసుకురావడానికి కళా బృందం ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎస్పీ బడుగుల సుమతి రూపకల్పన చేసిన ‘మేలుకొలుపు’ అన్న కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న ఏడుగురు సిబ్బందికి వరంగల్‌కు చెందిన కళాకారుల ద్వారా 20 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. గత యేడాది డిసెంబర్ మాసంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వారంలో మూడు రోజులు మారుమూల గ్రామాలకు వెళ్లి వివిధ అంశాలపై నాటికలు, కథలు, పాటలు, ఇంద్రజాలం ద్వారా చైతన్యం తీసుకువస్తున్నారు. కార్యక్రమం వద్దకు ప్రజలు తరలివచ్చేందుకు ఆకట్టుకునే పాటలు పాడుతున్నారు. రసాయనాల ద్వారా తయారయ్యే గుట్కాలు, గంజాయి, వరకట్న వేధింపులు, గృహహింస, బాల్య వివాహాలు, సెల్‌ఫోన్ లాభనష్టాలు, వాహన చోదకులు తీసుకునే జాగ్రతలు, హెల్మెట్ ధరించడం, మద్యం తాగి వాహనం నడిపితే కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, గ్రామస్తుల చైతన్యం, బాణామతి, చేతబడులు, మంత్రాలు తదితర అంశాలపై చైతన్యం కల్పిస్తున్నారు.
కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్న బాణామతి జాఢ్యాన్ని నివారించేందుకు ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. పెంచి, పోషించి ప్రయోజకలుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కొడుకు, కోడళ్లకు జ్ఞానోదయం కల్గించేందుకు కళాబృందం ప్రదర్శన గ్రామాల్లో మంచి ఆదరణ పొంది వృద్దుల కళ్లలో వెలుగు విరజిమ్మిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. జీవితాలను దుర్లభం చేసే మద్యం, జూదం వల్ల కుటుంబాలకు కలుగుతున్న నష్టాలపై మార్పు తీసుకురావడంలో ప్రదర్శనలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. చేనేత కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించే తీరును 15 నిముషాల నిడివితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ సుమతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కళాకారులకు తగిన సూచనలు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 152 గ్రామాలను ఎంపిక చేసి కళాకారుల ద్వారా ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఆయా పోలీసు స్టేషన్ల వారిగా ముందు సమాచారం ఇచ్చి ఎంపిక చేసిన గ్రామంలో ఏర్పాట్లు చేయిస్తున్నారు. రాత్రి 7.30 నుంచి 10.30 గంటల దాక మూడు గంటల పాటు ఒక్కో అంశంపై ప్రజలను ఆకట్టుకునే గ్రామీణ భాషలో కళాకారులు చక్కగా నటిస్తుండటం విశేషం. నాలుగు మాసాల్లో ఇప్పటి వరకు 48 గ్రామాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించారు. సమాజంలో మార్పు తీసుకురావాలన్న గొప్ప లక్ష్యంతో మెదక్ పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా అనేక మందిలో చైతన్యం వచ్చి కొత్త నడవడికి జీవితాలను మార్చుకుంటున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.