క్రైమ్/లీగల్

దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, మే 14 : మా భూములు మాకు కావాలంటు దీక్షలకు దిగిన రైతులపై ఏస్‌ఐ దురుసుగా ప్రవర్తించి టెంటు పీకేసిన సంఘటన మండల పరిధిలోని ఎల్లాయపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని భూములను ఇటివలే అనంతగిరి ప్రాజెక్టులో పోతున్నాయని రైతులనుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అనంతగిరి ప్రాజెక్టు కట్టను జరిపి కట్టడంతో ఎల్లాయపల్లికి చెందిన రైతుల భూములు పోవడం లేదు. ఈస్థలంలో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించ డానికి సిద్దమైంది. దీంతో రైతులు మా వ్యవసాయ భూములలో ఇండ్లు నిర్మించ వద్దని, మా భూములు మాకు కావాలంటు ఈనెల 13 ఆదివారం నుండి దీక్షల్లో కూర్చున్నారు. ఆదివారం చిన్నకోడూరు ఎస్‌ఐ అశోక్ మీరు దీక్షలు చేయడానికి అనుమతలు లేవంటు వారిని అరెస్టు చేశారు. సోమవారం మళ్లీ దీక్షల్లో కూర్చున్నారు. విషయం తేలుసుకున్న ఎస్‌ఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకోని వారిపై దురుసుగా ప్రవర్తించి కొంత మందిని అరెస్టు చేశారు. పరుమాల భూలక్ష్మి మా భూములు మాకు రావని మన స్థాపనికి గురై పురుగుల మందును సేవించి అత్మ హత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థతి విషమంగా ఉందని, ఐసియులో ఉందని డాక్టర్లు తెలిపారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మాపై దాడి చేసిన ఎస్‌ఐ అశోక్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

వడ దెబ్బతో రైతు మృతి
నంగునూరు, మే 14: వడ దెబ్బతో రైతు మృతి చెందిన సంఘటన నంగునూరు మండలంలోని ఖానాపూర్‌లో సోమవారం నాడు జరిగింది. గ్రామానికి చెందిన కొండం మల్లారెడ్డి (55) వరి ధాన్యాన్ని నర్మెటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకెల్లాడు. నాలుగు రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంతో రోజూ కొనుగోలు కేంద్రానికి వస్తు పోతున్నాడు. ఈ క్రమంలో సోమవారం నాడు మల్లారెడ్డి మధ్యాహ్నం వెళల్లో నర్మెట నుండి ఖానాపూర్‌కు వెలుతుండగా అంక్షాపూర్‌కు చేరుకోగానే ఎండ తకిడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. అంక్షాపూర్ గ్రామస్తులు అతనిని అటోలో ఖానాపూర్‌కు తరలిస్తుండగా అప్పటికే అతను చనిపోయాడని గుర్తించారు. మల్లారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.