మెదక్

రైతుబంధుతో రైతుకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నకోడూరు, మే 17: కాంగ్రెస్ పాలనలో రైతులు భారులు తీరిన విత్తనాలు, ఎరువులు దొరికేవి కాదని, ఎన్నో సార్లు రైతులపై పోలీసులు లాఠీచార్జీలు చేసిన సంఘటనలు ఉండేవని..ఇప్పుడు మన కేసీఆర్ పా లనలో అలాంటి పరిస్థితులు లేవని నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతుబంధు పథకం చెక్కులు, పట్టాపాస్ బుక్‌లు అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 లక్షలతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్, 13లక్షలతో నిర్మించిన గంగపుత్ర కమ్యూనిటీ భవనం లను ప్రారంభించారు. 5లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వాల పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ఏర్పాడ్డాక ఆటువంటి పరిస్థిలు పునరావృతం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రైతుకు 24గంటల నిరంతర విద్యుత్, సాగుకు ప్రాజెక్టుల నిర్మాణాలు, పంటకు పెట్టుబడులు, పండించిన పంటలకు మద్దతు ధర అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కొంత మంది రైతుల దాణ్యాన్ని కొనుగొలు చేసి కొనుగొలు కేంద్రాలను మూసేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రెండు గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, మండలానికి నాలుగు 5వేల మెట్రిక్ టన్నుల గోదాంలు కట్టించామన్నారు.
అకాల వర్షాలవల్ల తడిసిన దాణ్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలు పడకుండా ఉండాలంటే రైతులు ప్రతి ఇంటి ముందు, పొలంగట్ల వెంబడి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రతిఒక్కరు ముందుకు వచ్చి నాటిన మొక్కలను పరిరక్షించాలన్నారు. చిన్నకోడూరు మండలాన్ని హరిత మండలంగా తీర్చిదిద్దడానికి అందరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, రైతుసమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు నా గిరెడ్డి, ఎంపీపీ మాణిక్యరెడ్డి, జడ్పిటీసీ కమల, ఎఎంసీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాధకిషన్‌శర్మ, సర్పంచ్‌లు ఉమేశ్‌చంద్ర, వెంకటేశం, ఆంజనేయులు, సురేందర్‌రెడ్డి, బా లవ్వ, ఎంపిటీసీలు శశికళా, శ్రీను, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.