మెదక్

ఘణపురం ఆనకట్ట స్థిరీకరణతో 6వేల ఎకరాల సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మే 19: 1905లో మంజీర నదిపై ఘణపురం ప్రాజెక్ట్‌ను 21 వేల 625 ఎకరాల్లో స్తిరీకరిస్తూ నిర్మించారు. ఆ తరువాత ప్రాజెక్ట్ కాలువలను పాలనలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దాంతో చివరి భూములు బీడులుగా మారాయి. 2014లో పాలనలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఘణపురం ప్రాజెక్ట్ విషయంలో చొరవ చూపింది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కోరిక మేరకు ఉమ్మడి జిల్లా మంత్రి హరీష్‌రావు ఎంఎన్, ఎఫ్‌ఎన్ కాలువల ఆధునీకరణ కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం ఘణపురం ప్రాజెక్ట్ కట్ట ఎత్తు పెంచుటకు రెండు కాలువల ఆధునీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం వంద కోట్లు మంజూరు చేసింది. అయితే కట్ట పెంచేందుకోసం భూసేకరణలో 191 ఎకరాలు నిర్దారించారు. ఇందుకోసం 18 కోట్లు రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. భూమి కోల్పోతున్న పాపన్నపేట, నర్సాపూర్ మండలాల్లో 191 ఎకరాలు భూ సేకరణకు నిర్దారించారు. పాపన్నపేట మండలంలో కొడపాక, నాగ్సాన్‌పల్లి, చిత్రియాల్ గ్రామాలు ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో చిన్న ఘణపురం, సంగాయిపేట ఉన్నాయి. ఘణపురం ప్రాజెక్ట్ కట్టను పటిష్టం చేసేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనాగరాజు వెల్లడించారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో రైతుల నుండి తీసుకున్న భూములలో పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ఘణపురం కట్ట పెంచేందుకు 43 కోట్ల 64 లక్షలు ప్రభుత్వం మంజూరి ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో 28 కోట్లు మాత్రమే కట్ట పనులకు కెటాయించడం జరిగిందన్నారు. మిగిలిన డబ్బును భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. 28 కోట్ల నిధులలో కట్ట పనుల కోసం 14 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. కట్టక్రింద ఆప్రాన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు డబ్బు చెల్లించాల్సిన విషయాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. 372 మంది రైతుల నుండి ఘణపురం ఆనకట్ట పెంచేందుకు భూములను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా కట్ట పెంచడం వలన అధనంగా ఆరు వేల ఎకరాలు పెరగడమే కాకుండా ఆయకట్టు క్రింద ఉన్నటువంటి చివరి భూమికి 15 రోజుల వరకు నిఖరంగా నీళ్లు ఇవ్వవచ్చునని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 0.135 టీఎంసీ నీళ్లు ఉండగా కేవలం ఐదు రోజులు మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. కట్ట పెంచడం వలన 0.30 టీఎంసీ నీళ్లు ప్రాజెక్ట్‌లో ఉంటాయని తెలిపారు. కాగా ఈ నీటి ద్వారా చివరి భూముల వరకు రెగ్యులర్‌గా 15 రోజుల వరకు నీళ్లు ఇవ్వవచ్చని డీఈఈ శివనాగరాజు తెలిపారు.

బీజేపీ పన్నాగానికి తగిన గుణపాఠం జరిగింది..
* బలపరీక్షలో నెగ్గడంపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
సంగారెడ్డి టౌన్, మే 19: కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ పన్నిన పన్నాగానికి తగిన గుణపాఠం దక్కిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, కూన సంతోష్‌కుమార్‌లు పేర్కొన్నారు. కర్నాటక ప్రభుత్వ ఏర్పాటుపై పెట్టిన బలపరీక్షలో కాంగ్రెస్-జెడీఎస్ నెగ్గడంపై శనివారం సాయంత్రంలో పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ప్రధాని మోడీ, కర్నాటక గవర్నర్‌లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బీజేపి కుతంత్రాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువలు కాపాడబడ్డాయని, ఇది కాంగ్రెస్ పార్టీ నైతిక విజయమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్న శంకర్‌రెడ్డి, మహేష్, జాడ్జ్, సాబేర్, ఆరీప్ తదితరులు పాల్గొన్నారు.