మెదక్

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి: జేసీ నిఖిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 19: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలని జాయింట్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా పౌర సరఫరాలు, జిల్లా సహకార శాఖ, రైస్ మిల్లర్లు, ప్యాడి కాంట్రాక్టర్లతో సమావేశమై ధాన్యం కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు, చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్‌లో అధిక దిగుబడితో అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా 33, ఐకెపి ద్వారా 42 మొత్తం 75కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు జేసీకి తెలిపారు. ఇప్పటి వరకు 7500మంది రైతుల నుండి రూ.62కోట్ల విలువ గల 40వేల టన్నుల ధాన్యం సేకరించామని, అందులో 37వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిపారు. 3273మంది రైతులకు రూ.29కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. వాతావరణం అనుకూలంగా లేనందున ఆకస్మిక వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా సురక్షితంగా భద్రపర్చాలని జేసీ సూచించారు. అందుకు అవసరమైన వ్యవసాయ మార్కెటింగ్ గోదాములను సద్వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అప్‌లోడింగ్, మిల్లింగ్‌ను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో బియ్యాన్ని డెలివరి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను వినియోగించుకోవాలని జేసీ రైస్ మిల్లర్స్‌కు సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయాలని కొనుగోలు కేంద్ర నిర్వహకులకు సూచించాల్సిందిగా జిల్లా కోఆపరేటివ్ అధికారి, డీపీఎంలను ఆదేశించారు. ప్రతి కేంద్రానికి రెండు వాహనాలను ట్యాగ్ చేయాలని, అధిక వాహనాలను పూల్ చేసి రవాణ వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. రైతులు తీసుకొచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ జితేందర్‌రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రాములు, సివిల్ సప్లయ్ డిఎం సిద్దారెడ్డి, రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
సంగారెడ్డి టౌన్, మే 19: శాంతి భద్రతలకు విఘా తం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. తరచుగా నేరాలాకు పాల్పడే వారిపై పీడీ యాక్టు చట్టాన్ని ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులు తదితర అంశాల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిశుభ్రంగా, క్రమపద్దతిలో నిర్వహించడానికి, స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా వివిధ విభాగాలుగా విభజించి నిర్ధిష్టమైన కార్యచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రతి విభాగానికి ఒక పోలీస్ అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని, నియమించిన అధికారి తనకు నిర్దేశించిన పనిని సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. పీడీ యాక్టు ప్రయోగించేప్పుడు యమాలు పాటించాలని సూచించారు.