మెదక్

మిషన్ భగీరథ ప్రాజెక్టు పనితీరు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 19: ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడంలో మిషన్‌భగీరథ ప్రాజెక్టు పనితీరు అద్భుతమని, తాము అందించిన డబ్బులు వృధా కాలేదని విజయా బ్యాంకు సీఎండీ శంకరనారాయణ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, బ్యాంకు డైరెక్టర్‌లతో కలిసి కోమటిబండలోని మిషన్‌భగీరథ పనులు పరిశీలించిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్యాంకు మి షన్‌భగీరథ కోసం ప్రభుత్వానికి అందించిన రుణ సదుపాయా న్ని సమర్థవంతంగా వినియోగం జరిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విదంగా దాహార్తి నివారణ కోసం బృహత్తరమైన భగీరథప్రయత్నం తెలంగాణ సర్కా ర్ చేపట్టి సఫలీకృతమైందని పేర్కొన్నారు. కోమటిబండ ప్రాజెక్టుతోపాటు పైప్‌లైన్ నిర్మాణాలు, నీటి సరఫరా తీరు పరిశీలించడంతోపాటు ఫోటో ఎగ్జిబీషన్ ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించిన మిషన్‌భగీరథ మోడల్‌ను ఆయన తిలకించా రు. మిషన్‌భగీరథ తాగునీటి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, పథక నిర్మాణం పూర్తి చేయడంలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగాన్ని ప్రశంసించగా, ప్రజల సంక్షేమం కోసం చేపట్టే పనులకు తమ ప్రోత్సాహం, సహకారం ఉంటుందని చెప్పారు. కాగా మొదటగా గజ్వేల్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తం గా చేపట్టిన మిషన్‌భగీరథ తాగునీటి పథకం పనులను ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి విజయాబ్యాంకు సీఎండీ శంకర నారాయణ, ప్రతినిదులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యాలయ కార్యదర్శి సందీప్‌కుమార్, ఈడీ నాగేశ్వర్‌రావు, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, మిషన్‌భగీరథ ఎస్‌ఈ చక్రవర్తి, ఈఈ రాజయ్య, డిప్యూటీ ఈఈలు నాగార్జున, కమలాకర్‌లు పాల్గొన్నారు.