మెదక్

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మే 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేదల పక్షపాతి అని తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ పట్టణం సాయి బాలాజీ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారికి అంచలంచెలుగా న్యాయం చేస్తున్నారని తెలిపారు. సమైఖ్య పాలనలో వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. వడ్డెరుల డిమాండ్స్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామని ఆమె వడ్డెర సంఘం నాయకులకు భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారికి ఒకేసారి న్యాయం చేయాలంటే ప్రభుత్వంపై ఆర్దిక భారం పడుతుందన్నారు. అందువలన అంచలంచెలుగా ఒక్కో వర్గం వారికి ఆర్దిక పరిపుష్టి ముఖ్యమంత్రి కల్పిస్తున్నారని ఆమె తెలిపారు. వడ్డెరుల సమస్యల పరిష్కారం కోసం సమయం పడుతుందన్నారు. ప్రతి కులం వృత్తి గురించి జీవన విధానంపై అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చించారని ఆమె తెలిపారు. ఆర్దిక స్థితిపై అట్టడుగు వర్గాలకు సంబంధించిన పరిస్థితులను ఆధ్వయనం జరిపారని తెలిపారు. సమైఖ్య పాలనలో వడ్డెరులను బీసీ ఎలో పడేశారన్నారు. 65 సంవత్సరాలు నిండిన నిరుపేద వృద్దులకు ప్రభుత్వం వెయ్యి రుపాయల పెన్షన్ కల్పించిందన్నారు. రాబోయే కాలంలో కూడా బోధకాలు ఉన్నవారికి ఫించన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఐటి మంత్రి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వడ్డెరులకు కృత్రిమ ఇసుక తయారు చేసేందుకు అనుమతి సమకూర్చారని ఆమె తెలిపారు. వీరికి ప్రభుత్వమే ఉపాది కల్పించే ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయాన్ని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక మేనమామగా కల్యాణ లక్ష్మీ, శాది ముబారక్‌తో 18 ఏళ్లు నిండిన ఆడపిల్లల పెళ్లికి లక్ష 116 రుపాయలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. కల్యాణ లక్ష్మీ మంజూరు కోసం తానే సంతకం చేస్తానన్నారు.