మెదక్

మిషన్ భగీరథలో సిద్దిపేటను మొదటిస్థానంలో నిలుపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 26: మిషన్ భగీరథ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని, అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మిషన్ భగీరథ పనులను పూర్తి చేసిన మొదటి జిల్లాగా సిద్దిపేట ఖ్యాతి గడించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, గడా హన్మంతరావు, ట్రైనీ ఐఏఎస్ అవిశ్యంత్ పండా, ఆర్‌డబ్ల్యూఎస్ సిఇ విజయప్రకాష్, సిఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్‌సి చక్రవర్తి, ఇఇ శ్రీనివాస్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, జనగామ నియోజకవర్గంలోని చెర్యాల, కొమురవెళ్లి, మద్దూరు మండలాల్లో మిషన్ భగీరథ పనులపై అధికారులతో ఆరా తీశారు. చెర్యాల, మద్దూరు, కొమురవెళ్లి మండలాల్లో పెండింగ్ పనులను జూన్ 6లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పెండింగ్ పనులు జూన్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాత ఒహెచ్‌ఆర్ ట్యాంకులను కలరింగ్ చేసి అందంగా ముస్తాబు చేయాలన్నారు. వాటికి ఏమైన మరమ్మతు పనులు ఉంటే ఒహెచ్‌ఆర్ పనులను చేయించి ట్యాంకులను వినియోగంలోకి తేవాలన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఇంట్రా పైపులైన్‌లు, ఓహెచ్‌ఆర్ ట్యాంకులు వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి పైపులైన్‌లు తాగునీటి సరఫరాపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని హుస్నాబాద్ పరిధిలో హుస్నాబాద్, అక్కనపేట, కొహెడ, మానకోండూరు, నియోజకవర్గం పరిధిలోని బెజ్జంకి మండలాల్లో మిషన్ భగీరథ పనులపై ఆరా తీశారు. బెజ్జంకి మండలంలో 37హబిటేషన్స్ ఉన్నాయని వాటిలో 21 ఓహెచ్‌ఆర్ ట్యాంకులకు 18పూర్తికాగా 3పురోగతిలో ఉన్నాయన్నారు. బెజ్జంకి మండలంలో 8811ఇండ్లకు ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో 25హబిటేషన్స్‌కు 10ఓహెచ్‌ఆర్ ట్యాంకులను పూర్తి చేశామన్నారు. అక్కనపేటలో 45ఓహెచ్‌ఆర్ ట్యాంకులకు 14పూర్తి చేశామని, మరో31 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొహెడలో 44హాబిటేషన్స్‌కు 37 ఓహెచ్‌ఆర్ ట్యాంకులకు 20పూర్తి చేశారన్నారు. పనులన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్‌లో 188 హాబిటేషన్స్‌కు 111 ఓహెచ్‌ఆర్ ట్యాంకులను పూర్తి చేశామన్నారు. గజ్వేల్‌లో 98శాతం పూర్తి అయినట్లు తెలిపారు. దుబ్బాకలో దుబ్బాక, మిరుదోడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్‌లో 158 హాబిటేషన్స్‌కు 86ఓహెచ్‌ఆర్ ట్యాంకులు పూర్తికాగా మరో 2పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్థానిక సమస్యలను మంత్రి హరీష్‌రావు, అధికారుల దృష్టికి తీసుకోచ్చారు. పలు ప్రాంతాల్లో వాటర్ లీకేజీలు ఉన్నాయని, నీటి ట్యాప్‌లోని చర్రీలు తొలగిపోతున్నాయన్నారు. పెద్దమాసాన్‌పల్లిలో నీటి సరఫరాకు ఇంకను కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సమస్యలపై చర్చించి రోజు వారిగా పనులను పూర్తి చేసి తనకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో మిషన్ భగీరథ పనుల్లో ఆదర్శంగా నిలుపాలన్నారు.