మెదక్

సంగారెడ్డిలో మెడికల్ కళాశాల కోసం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 26: జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో మెడికల్ కళాశాల మంజూరు చేసేంత వరకు ఉ ద్యమిస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పే ర్కొన్నారు. మెడికల్ కళాశాల మంజూరు చేయాలని డి మాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసినవిలేఖరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిరాహా ర దీక్ష చేపట్టడంతో పాటు 31న సంగారెడ్డి, సదాశివపే ట పట్టణాల బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. బంద్‌కు ఆర్టీసీ, వాణిజ్య, వ్యాపార సంస్థలు సహకరించాలని కోరారు. జిల్లాకేంద్రానికి మంజూరైన మెడికల్ కళాశాలను మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటకు తరలించుకుపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం నల్గొండ, సూర్యపేటలకు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి కానీ సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నుండి ప్రకటన వచ్చేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తోపాజీ అనంతకిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్న శంకర్‌రెడ్డి, ఆంజనేయులు, సంగమేశ్వర్, భిక్షపతి, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఏడుపాయలను సందర్శించిన
వైద్యశాఖ అదనపు డైరెక్టర్ పద్మావతి
పాపన్నపేట, మే 26: శ్రీ ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని శనివారం తెలంగాణ రాష్ట్ర మలేరియా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తదితర సిబ్బందితో దర్శించుకున్నారు. అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఏడుపాయల్లో మలేరియా కేసులు చాలా ఉండేవని ప్రస్తుతం తగ్గినట్లు తెలిపారు. మలేరియా కేసుల విషయమై వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. గతంలో ఏడుపాయల అంటే మలేరియాకు నిలయంగా ఉండేదని, అలాంటిది ఇప్పుడు తాము తీసుకుంటున్న చర్యలతో మలేరియా తగ్గుముఖం పట్టిందని ఆమె తెలిపారు. ప్రతి రోజు ఏడుపాయల్లో వైద్య సిబ్బంది స్ప్రే చేస్తున్నారని, శని, ఆదివారాల్లో ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏడుపాయలకు రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు పెద్దయేత్తున వస్తుంటారని, మలేరియా వ్యాధిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. ఆమె వెంట హైదరాబాద్ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, మలేరియా కన్సల్‌టెంట్ సంజీవరెడ్డి, ఎన్.సైదులు, మెదక్ డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు, డిప్యూటి డీఎంహెచ్‌ఓ ఇర్షాద్, పొడ్చనపల్లి మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిని, మలేరియా అసిస్టెంట్ అధికారి కుమారస్వామి, డిప్యూటి డెమో రేణుకుమార్, ఫహీం పాషా, మనోహర్‌రెడ్డి, కో ఆర్డినేటర్ కిష్టయ్య, పొడ్చన్‌పల్లి సూపర్‌వైజర్ కృష్ణవేణి, శ్రీనివాస్‌రెడ్డి, ఏడుపాయల హెల్త్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు ఉన్నారు.