మెదక్

రిమ్మనగూడ రహదారిపై రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 26: రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబందించి బాదితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ వైపు నుండి సిద్దిపేట వైపు వెల్తున్న లారీని వెనక నుండి అతి వేగంగా వస్తున్న గరుడ ఎక్స్‌ప్రెస్ రిమ్మనగూడ శివారులో ఢీకొట్టింది. దీంతో డివైడర్ దాటి లారీ కుడివైపు రోడ్డు పైకి వెల్లగా, గరుడా ఎక్స్‌ప్రెస్ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అయితే కుడివైపు రోడ్డు పైకి వెల్లిన లారీని సిద్దిపేట వైపు నుండి వస్తున్న టాటాసుమో, చిన్నలారీ ఢీకొట్టాయి. దీంతో టాటాసుమోలో ప్రయాణిస్తున్న జిన్నారంకు చెందిన మల్లేషం యాదవ్, అతని బార్య గండమ్మ, కొడుకు లక్ష్మణ్, అతని బార్య పుష్ప, వారి కుటుంబ సభ్యులు ఆకాశ్, నిహారిక, విజయలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే గరుడ ఎక్స్‌ప్రెస్ అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మంచిర్యాల, లక్సెట్టిపేటలకు చెందిన సంద్య, రాహుల్, సాయినిఖిల్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ అభివృద్ది అథారిటీ అధికారి హన్మంతరావు, డిప్యూటీ పోలీస్ కమిషనర్ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మహేందర్, సీఐలు శివలింగం, ప్రసాద్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో పరిస్థితి విషమంగా ఉన్న 30 మందిని సిద్దిపేట, గజ్వేల్‌ల నుండి రప్పించిన అంబులెన్స్‌లలో చికిత్సల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అలాగే సంఘటన స్థలంలో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.