క్రైమ్/లీగల్

కత్తిదూసిన పాత కక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, మే 29: పురివిప్పిన పాతకక్షలు ఓ వ్యక్తిని బలితీసుకున్నాయి. మండలంలోని శేకాపూర్‌లో టెంట్‌హౌజ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముస్లీం డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఎండీఏ)అధ్యక్షుడు ఎంఏ గౌస్(38) ను దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించి సీఐ.సైదీశ్వర్ కథనం ప్రకారం.. గౌస్ సోమవారం మధ్యాహ్నం టెంట్‌హౌజ్ వెనకాలున్న మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికెళ్లి పడుకున్నాడు. నిందితుడు లైక్ అనే వ్యక్తి ఆయనకు ఫోన్‌చేసి మాట్లేదుందంటూ పిలిపించుకుని శేక్‌షాబుద్ధీన్ దర్గా వెనుకల తీసుకుపోయాడు. పథకం ప్రకారం కొద్దిసేపు మాట్లాడినట్లు నటించి, అకస్మాత్తుగా కత్తితో ఆయనపై దాడిచేసి విచక్షణా రహితంగా కసితీరా పొడిచాడు. చివరిగా పొట్టలో బలంగా పొడవడంతో పేగులన్నీ బయటకొచ్చాయి. పిడి ఊడిపోయి కత్తిమాత్రం కడుపులోనే మిగిలిపోయింది. దీంతో హతుడు చేసిన అరుపులకు ఇరుగుపొరుగువారు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు ఆసుపత్రి నిర్దారించారు. ఇదిలా ఉండగా గతంలో నిందితుడి హైదరాబాద్‌లో నివాసం ఉండేవాడు. అక్కడ ఈయనకు నేరచరిత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేసులనుంచి తప్పించుకునేందుకు ఆయన శేఖాపూర్ పరిసరాల్లో తలదాచుకునేవాడు. హతుడు ఈ సమాచారాన్ని గుట్టుగా పోలీసులకు చేరవేయగా ఆయన్ని హైదరాబాద్ పోలీసుల అరెస్టుచేసి జైలుకు పంపించారు. దీంతో నిందితుడు ఆయనపై కక్ష పెంచుకున్నాడు. సంవత్సరం కిందటే జైలునుంచి విడుదలై గ్రామంలోనే ఉంటున్నాడు. హతుడు నెల రోజుల కిందటే కువైట్‌నుంచి స్వదేశానికి తిరిగొచ్చి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆయనపై కక్ష పెంచుకున్న నిందితుడు హత్యకు పథకరచన చేశాడు. సోమవారం అదునుచూసి పక్కా ప్రణాళిక తో దాడి చేసి హతమార్చాడు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతుడి తమ్ముడు ఎంఏ.మహబూబ్ ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు
గౌస్ హత్య ఘటన గ్రామంలో దావానంలో వ్యాపించింది. కుటుంబీకులు, బంధువులు, సంబంధికులు పెద్ద సంఖ్యలో అసుపత్రికి చేరుకున్నారు. గౌస్ మృతదేహాన్ని చూసిన వారి రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య ఇద్దరు మగ, ఇద్దరు ఆడ సంతానం ఉన్నారు. టెంట్ హౌజ్ వ్యాపారంతో తమను పోషిస్తున్న పెద్దదిక్కు హత్యకు గురవడంతో తమకు దిక్కెవరని భార్య రోదించింది.