తెలంగాణ

పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మే 28: ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ కమి టీ అధ్యక్షురాలిగా రెండవ సారి ఎన్నికైన వాకిట సునీతా లక్ష్మారెడ్డిని స్థానిక నాయకులు సోమవారం సన్మానించా రు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి అధ్వర్యంలో పలువురు నాయకులు ఆమె నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సునీతా లక్ష్మారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సునీతారెడ్డి నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలోని పది శాసనసభ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరడం ఖాయమని వారు జోస్యం చెప్పారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు లాభం చేకూరు తాయన్నారు. నియంత పోకడలతో తెలంగాణ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే శాసనసభ ఎన్నికలలో అధికారం కోల్పోక తప్పదన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇక యువతకు అధిక ప్రాదాన్యతఇవ్వాలని వారు పార్టీ అధ్యక్షురాలు వాకిట సునీతా లక్ష్మారెడ్డిని కోరారు. పార్టీలో పునరుత్తేజం తీసుకు రావడానికి కేవలం యువతీ యువకుల మూలంగానే సాధ్యపడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఖయ్యూం మతిన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.