మెదక్

మార్కెట్ కమిటీ చైర్మన్‌లకు పోటా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 28: తెలంగాణ సర్కార్ నామినేటేడ్ పదవులను భర్తి చేస్తుండటంతో నియోజక వర్గంలోని పలువురు సీనియర్ నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశీస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్న పలువురు నేతలు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్ర బిందువుగా ఉండటంతో పలువురు నేతలు ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను పలువురు నేతలను ఆశీస్తుండటంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణ సర్కార్ మార్కెట్ చైర్మన్ పదవులను సైతం తొలి సారిగా రిజర్వేషన్లు అమలు చేస్తుంది. అలాగే మహిళలకు సైతం రిజర్వేషన్లు కల్పించారు. సిద్దిపేట నియోజక వర్గ పరిధిలో మూడు మార్కెట్ కమిటీలు ఉండగా సిద్దిపేట, చిన్నకోడూరు చైర్మన్ పదవులు జనరల్, నంగునూర్ మండలం సిద్దన్నపేట బిసి జనరల్‌కు రిజర్వు కాబడినాయి. జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీగా ఉన్న సిద్దిపేట 5 కోట్లకు పైగా ఆదాయ వనరులు కలిగి ఉన్నాయి. కాగా ప్రస్తుతం నంగునూర్ మండలం సిద్దన్నపేట, చిన్నకోడూరు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశారు. జిల్లాలోనే అత్యధిక ఆదాయ వనరులు కలిగి ఉన్న సిద్దిపేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. సిద్దిపేట నియోజక వర్గం నుండి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావుప్రాతినిథ్యం వహిస్తుండటంతో మంత్రి ఆశీస్సులు ఏవరికి దక్కితే వారికే పదవులు కేటాయించే అవకాశం ఉంది. సిద్దిపేట మార్కెట్ కమిటీ పదవుల కోసం తెరాస రైతు విభాగం నేత రంగధాంపల్లికి చెందిన వంగ నాగిరెడ్డి, మాజీ ఎంపిపి ఉపాధ్యక్షుడు మారెడ్డి రవీందర్‌రెడ్డి, నంగునూర్ మండల పార్టీ అధ్యక్షుడు వేముల వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటిసిలు బాలకిషన్‌రావు, బాలరంగం, రాఘవాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్యాల బాలరాజులు సైతం మార్కెట్‌కమిటీని ఆశీస్తున్నారు. ఏలాగైన మార్కెట్ కమిటీని పదవిని దక్కించుకునేందుకు మంత్రి హరీష్‌రావుపై వత్తిడీ తెస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశీస్తున్న పలువురు నేతలు సిఎం కెసిఆర్‌తో సైతం సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. మార్కెట్ చైర్మన్ కుర్చిపై కనె్నసిన పలువురు నేతలు ఇప్పటికే తమకు వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నంగునూర్ మండలం సిద్దన్నపేట మార్కెట్ కమిటీ ఏర్పాటు మాజీ సర్పంచ్ సంగు పురేందర్ స్థలాన్ని కేటాయించారు. చైర్మన్ పదవి సైతం బిసి జనరల్ రిజర్వుకావటంతో ఇప్పటికే సంగు పురేందర్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పగించేందుకు టిఆర్‌ఎస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. సంగుపురేందర్‌కు చైర్మన్ పదవి కేటాయించేందుకు పెద్దగా ఏవరికి అభ్యంతరాలు లేకపోవటంతో దాదాపుగా చైర్మన్‌గా ప్రకటించేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. సిద్దన్నపేట మార్కెట్ కమిటీ పేరు పురేందర్ ను అధికారికంగా ప్రకటించటంమే మిగిలి ఉంది. చిన్నకోడూరు మార్కెట్ యార్డు కొత్తగా ప్రకటించినప్పటికి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. మార్కెట్ యార్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైన ఇప్పటి వరకు స్థల సేకరణ మాత్రం జరుగలేదన్నారు. మార్కెట్‌యార్డును తాత్కలికంగా ఏర్పాటు చేసి కమిటీ కార్యకలపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. చిన్నకోడూరు మార్కెట్ కమిటీ జనరల్‌కు రిజర్వుకాబడింది. చైర్మన్ పదవి కోసం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సీనియర్ నేతలు సత్యనారాయణరెడ్డి, జక్కపూర్‌కు చెందిన గురజాల బాల్‌రెడ్డిలు ఆశీస్తున్నారు. కుంట వెంకట్‌రెడ్డి చైర్మన్ పదవి కోసం తన సర్వశక్తుల ఒనర్చి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూర్ మండలం సిద్దన్నపేట మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులను ఆశీస్తున్న పలువురు నేతలు మంత్రి హరీష్‌రావు ఆశీస్సుల కోసం పడరాని పాట్లు పడతున్నారు. మంత్రి హరీష్‌రావు ఆశీస్సుల లభించిన వారికే చైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పది మార్కెట్ కమిటీల చైర్మన్‌లను ప్రకటించారు. త్వరలోనే సిద్దిపేట నియోజక వర్గం చైర్మన్ పదవులతో పాటు మరిన్ని కమిటీలతో కూడిన రెండవ జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం.