మెదక్

చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సొత్తు విలువ రూ. 1.25 కోట్లు
* నేరస్తుల నుండి రూ.3.95 లక్షల నగదు స్వాధీనం* ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సంగారెడ్డి టౌన్, జూన్ 14: గత ఆరు సంవత్సరాలుగా మద్యం షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐదుగురు ముఠా సభ్యులను చూపుతూ వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులంతా కామారెడ్డి, సిరిసిల్లకు చెందిన వారు. గుర్రాల శ్రీనివాస్‌గౌడ్, శివలింగయ్యలు కామారెడ్డికి చెందిన వారు కాగా, బూర్ల సతీష్, సిద్దులా శ్రీకాంత్, వెలుపుల శివకుమార్‌లు సిరిసిల్లకు చెందిన వారు. వీరిని ఈ నెల 13న సంగారెడ్డి శివారులోని ఎంఎన్‌ఆర్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి గత ఆరు సంవత్సరాల నుండి రాత్రి సమయాల్లో మద్యం షాపుల షెటర్లను పగులగొట్టి అందులో ఉన్న మద్యం సీసాలను దొంగిలించుకుపోతున్నారు. 2012లో సిరిసిల్ల ప్రగతినగర్‌లో నివాసం ఉంటూ మాచారెడ్డిలో మద్యంషాపును నిర్వహిస్తున్నారు. దొంగిలించిన మద్యాన్ని ఈ షాపుద్వారా విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. కామారెడ్డిలో ఫ్లాట్లు కొనుగోలు చేయడంతో పాటు గృహాలు సైతం నిర్మించుకొని ఒక హోదాలో బ్రతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9జిల్లాల్లో 38మద్యం షాపుల్లో మద్యం దొంగతనం చేశారని, దాని విలువ సుమారు ఒక కోటి 25లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ ముఠా నుండి 3లక్షల 95వేల రూపాయలను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జగిత్యాల్, పెద్దపల్లి, మెడ్చల్ జిల్లాలో మొత్తం 43దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. అన్ని జిల్లాలకు సమాచారం అందించామన్నారు. ముఠా సభ్యుల వద్ద ఉన్న నగదు, ఆస్తులనదు జప్తుచేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. చాకచక్యంగా దొంగల ముఠాను అరెస్టు చేసిన రూరల్ సీఐ నరేందర్, ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్స్ రాజు, రాజలింగం, అతిక్, వాజీద్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు.