మెదక్

ముస్లిం మైనార్టీల్లో ఆత్మ విశ్వాసం పెంచిన కేసీఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 16 : తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలకు ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈద్గా వద్ద ముస్లింలకు మంత్రి హరీష్‌రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ముస్లింలకు మంచి భవిష్యత్తును అందించే దిశగా పాటుపడుతుందన్నారు. పేద యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం 1.16లక్షల అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద మైనార్టీ విద్యార్థుల చదువు కోసం 200లకు పైగా రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కొత్త బట్టలు ఇచ్చి పండుగలు జరుపుతున్నారన్నారు. అందరి అభ్యున్నతే తెలంగాణ అభివృద్ధి అంటు అన్ని రంగాల్లో పేదవారికి టీఆర్‌ఎస్ సంక్షేమ ఫలాలు అందించటంతో పాటు అభివృద్ధి చేసేందుకు ముందుకు నడుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ముస్లిం అభ్యున్నతి కోసం కృషిచేస్తామన్నారు. ఉర్దు భాషను రాష్ట్ర రెండవ అధికారిక భాషగా గుర్తించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలను గుర్తించి డబుల్ బెడ్‌రూంలలో అర్హులకు అందిస్తామని హామీనిచ్చారు.