మెదక్

రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూన్ 16: రాష్ట్రంలో ఉనికి కోసం పాకులాడుతున్న ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం రాత్రి గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ప్రజ్ఞాపూర్‌లో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో తట్టెడు మన్ను తీయని కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతోందని, కుట్రలు పన్నుతూ కేసులు వేసి అభివృద్దిని అడ్డుకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా కాళేశ్వరం నీళ్ళు తెస్తామని, మల్లన్నసాగర్ నిండుగా నీళ్ళు ఉంటాయని పేర్కొన్నారు. అయితే కాల్వల నిర్మాణంతో చెరువు, కుంటల్లో నీరు నింపి సాగు భూములను సస్యశ్యామలం చేస్తామని రైతు ఆత్మహత్యల నివారన లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కార్ ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్దికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తుండగా రూ. వేల కోట్ల వ్యయంతో వివిద అభివృద్ది పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. కాగా రింగ్‌రోడ్డు నిర్మాణం, విజ్, నాన్‌విజ్ మార్కెట్, ఆడిటోరియం, సమీకృత ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఎడ్యుకేషన్‌హబ్, రోడ్డు విస్తరన పనులు గజ్వేల్‌కే తలమానికంగా మారుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, బస్టాండ్‌ల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు ఏర్పాటు చేస్తుండగా మిషన్‌భగీరథతో ఇంటింటికీ సాగు నీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ సర్కార్‌కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, హౌజింగ్ కార్పోరేషన్ చైర్మెన్ భూంరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్‌లు రామదాసు, నర్సింలు, సుబాష్‌చంద్రబోస్, జకియొద్దీన్, సంతోషిని రాంచంద్రాచారి, నారాయణరెడ్డి, నేతలు బెండ మదు, గోపాల్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మద్ది రాజిరెడ్డి, ఊడెం కృష్ణారెడ్డి, పాండుగౌడ్, రమేశ్‌గౌడ్, సబ్బని నరేశ్, కుమార్‌యాదవ్, మంగళి సాయి, కలీం, ఆకుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి దీవెనతో
రంగనాయక సాగర్‌కు జలకళ
* రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట, జూన్ 10 : పెద్దమ్మ తల్లి దయతో లింగారెడ్డిపల్లి రంగనాయక్ సాగర్ రిజర్వాయర్‌తో నీళ్లతో కళకళ లాడుతూ నిండుగా ఉండనుందని రాష్ట్ర భారీ నీటిపారదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గ్రామస్థులు చేపలు పట్టుకునేందుకు వీలుగా మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసి జలాశయంలో చేపపిల్లలు, రొయ్యలు పట్టుకూనేలా శాశ్వత ఉపాధి కల్పించటం జరుగుతుందన్నారు. దీంతో వేలాదిమందికి బతుకుదెరువు లభిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. శనివారం సిద్దిపేట మండలం లింగారెడ్డిపల్లిలో 1.53 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పెద్దమ్మ దేవాలయం 12వ వార్షికోత్సవానికి హాజరై పెద్దమ్మ-పెద్దిరాజులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో లింగారెడ్డిపల్లి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైందని, ఈగ్రామాన్ని త్వరలో సిద్దిపేట మున్సిపాల్టీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. లింగారెడ్డిపల్లి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తుల కృషిచేస్తానని గ్రామస్థులకు భరోసా కల్పించారు. గ్రామంలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, కల్యాణ మండపం సత్వర చర్యలు తీసుకుంటానన్నారు. లింగారెడ్డిపల్లి రైతులకు రైతుబంధు చెక్కులు, పాస్‌బుక్కులు అందచేయాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో లింగారెడ్డిపల్లెకు అధికారులు వచ్చి పంపిణీ చేస్తారని మంత్రి హరీష్‌రావు హామీనిచ్చారు.