మెదక్

ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 21: సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గురువారం పలువురు పోలీస్ అధికారులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో డీఎస్పీలు శ్రీనివాస్‌కుమార్, సీతారం, సీఐలు దామోదర్, పాలవెల్లి, లక్ష్మారెడ్డి, నరేందర్ తదితరులు ఉన్నారు.

అప్పుల విషయం ఏనాడు చెప్పలేదు
* మృతుడి తండ్రి యాదగిరి

సిద్దిపేట, జూన్ 21: తన కుమారుడు హన్మంత్‌రావు అప్పుల విషయం, అప్పుల వేధింపుల విషయం తనకు ఏనాడు చెప్పలేదని మృతుడు తండ్రి సావెలి యాదగిరి తెలిపారు. ఎప్పుడు చూసిన తనకు ఎల్‌ఐసీల ఫాలసీల పని ఉందని, ఇతర బిజినేస్ చేస్తున్నట్లు తెలిపారు. అప్పులతో వేధిస్తున్నట్లు తనకు చెపితే ఎకరం భూమిని అమ్మినైన తన కుమారుడు హన్మంత్‌రావు, కోడలు హరిత, మనుమరాల్లు దీక్షశ్రీ, షైనిశ్రీలను కాపాడుకునేవాడినని బోరున విలపించారు.
ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు: మృతుడి సోదరుడు పురుషోత్తం
తన సోదరుడు సావేలి హన్మంత్‌రావు భార్య, కూతుళ్లను హత్యచేసి తాను హత్య చేసుకుంటాడని అనుకోలేదని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని పురుషోత్తం తెలిపారు. గంగుల మమత, భాస్కర్‌లు వెలికట్టకు డబ్బుల కోసం వచ్చిన తాను వారికి సర్ధి చెప్పినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సెటిల్ చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిందని బోరున విలపించారు.