మెదక్

యోగా విద్య ఒక అద్భుతమైన ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 21: 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్ జిల్లాలో జిల్లా ఎస్పీ కుమారి చందనాదీప్తి ఆధ్వర్యంలో సాయి బాలాజీ ఫంక్షన్‌హాల్లో యోగాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యోగా విద్య ఒక అద్భుతమైన ప్రక్రియగా అభివర్ణించారు. మన భారతావని ప్రపంచానికి అందించిన ఆరోగ్య ఫలం యోగా అని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. యోగా వల్ల మన దేశానికి ప్రపంచంలో ఒక మంచి స్థానం వచ్చిందని, దీని వల్ల ప్రతి భారతీయుడు గర్వపడే అంశం అని యోగా వల్ల జరిగే లాభాల గురించి ఎస్పీ వివరించారు. పోలీస్ శాఖ అనేది చురుకుదనానికి, శారీరక పటుత్వానికి పెట్టింది పేరు అన్నారు. యోగ వల్ల చురుకుదనం,గా ఉండటమే కాకుండా వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. అదే విధంగా అతి చిన్న వయస్సులోనే రోగాలకు గురవుతున్న ప్రమాద పరిస్థితులు నెలకొన్న నేటి పరిస్థితుల్లో యోగా, సూర్య నమస్కారం, నడక వంటివి మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని ఎస్పీ సూచించారు. చిన్ననాటి నుండి యోగా సాధన అలవాటు వలన శారీరక, మానసిక సత్తువ కలిగి, జీవితంలో రాణిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధనపు ఎస్పీ నాగరాజు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా సాయుద దళ డిఎస్పీ మురళి, సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కొల్చారం, జూన్ 21: మానవుడు యోగా చేయడం వల్ల శరీర దారుఢ్యంతో పాటు అవయవాలు మంచిగా పనిచేస్తాయని కొల్చారం మండల విద్యాధికారి నీలకంఠం అన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురష్కరించుకొని మండల కేంద్రం కొల్చారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఉదయానే్న యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని, దానికి తోడుగా ప్రతి రోజు ఉదయానే్న యోగాసనాలు చేస్తే రోగాలు దరిచేరవన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని యోగా చేయాలని తెలిపారు. దీంతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు యోగాసనాలు నిర్వహించారు.