మెదక్

జర్నలిస్టు కుటుంబం ఆత్మహత్యపై మంత్రి దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 21: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఆంధ్రభూమి పత్రిక విలేకరిగా పనిచేస్తున్న హన్మంతరావు మృతి పట్ల మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన వృత్తిలో ఉండి ఇలాంటి సంఘటనకు పాల్పడడం మనసును కలిచి వేసిందన్నారు. సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలున్నాయని, ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. యువ జర్నలిస్టుగా హన్మంతరావు సేవలందించాడని, ఇలాంటి జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పక్షాన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. జర్నలిస్టులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్టు కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద 25వేలను జర్నలిస్టు యూనియన్ నేత రంగాచారి ద్వారా మృతుడి తండ్రి యాదగిరికి అందించారు.

తెలంగాణకు జీవితం అంకితం చేసిన జయశంకర్
* నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, జూన్ 21: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితానే్న అంకితం చేసారని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్దాత్త కర్తగా పేరుగాంచిన జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తన దైన ముద్ర వేసారని కొనియాడారు. జయశంకర్ సార్ వర్ధంతి పురస్కరించుకుని పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కెసిఆర్ జయశంకర్‌సార్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. సుమారు పదమూడు సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విలువైన సలహాలతో కేసీఆర్‌ను నడిపించిన ఆయన చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖిస్తారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.