మెదక్

గోదావరి నీరు తెచ్చి మీ రుణం తీర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, జూన్ 23: డిసెంబర్ కల్లా సాగునీరందించి మీ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. శనివారం నాడు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పథకాలను తిమ్మాయిపల్లి గ్రామస్తులు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారన్నారు. గ్రామస్థుల సహకారం ఉంటే గ్రామం ఎంతో అభివృద్థి చెందుతుందని, దానికి నిదర్శనం తిమ్మాయిపల్లి గ్రామం అన్నారు. గ్రామంలో సేద్రియ వ్యవసాయంతో పంటలు పండించి రోగాల భారిన పడకుండా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని అన్నారు. రైతులకు కరంటు ఇబ్బంది లేకుండా 24 గంటల నాణ్యమైన కరంటు అందజేస్తున్నామన్నారు. రైతులకు పంటపెట్టుబడులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం రైతులకు ఎకరాకు 8వేలు అందిస్తుందన్నారు. పండించిన పంటలు అమ్ముకోడానికి 3, 4 గ్రామాలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. డిసెంబర్ కల్లా కాలువల ద్వారా సాగునీరు అందించి మీ రుణం తీర్చుకుంటామని అన్నారు. గ్రామంలో చిరు ధాన్యాలు పండించే రైతులకు పెసర్లు, మినుములు ఉచితంగా అందజేస్తామని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. కాల్వలలో భూమి కోల్పోయిన 71 మంది రైతులకు 2కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎవరు వెల్లవద్దని, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. సిద్దిపేట ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా చేర్చుతామని, ఈ ఆస్పత్రిని ప్రజలందరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఎఎంసీ చైర్మన్‌లు పురెందర్, వెంకట్‌రెడ్డి, సోసైటీ చైర్మన్‌లు రమేష్, సోమిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు రాంచంద్రారెడ్డి, డీఆర్‌డీఓ స్వామిగౌడ్, ఎంపీడీఓ నాగేశ్వర్, తహశీల్దార్ విజయభాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ లోగా కెనాల్ స్టక్చర్ పూర్తి చేయాలి: మంత్రి
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూర్‌పల్లి గ్రామంలో 13వ ప్యాకేజీ మల్లన్నసాగర్ నుండి కొండ పోచమ్మ సాగర్ వరకు సాగుతున్న గ్రావిటీ కెనాల్ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం పరిశీలించారు. అక్టోబర్ నెలాఖరులోపు గ్రావిటీ కెనాల్ పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. 36 కిలోమీటర్ల గ్రావిటీలో 18కిలోమీటర్లు కెనాల్ పూర్తయిందని ఇరిగేషన్ అధికారులను మంత్రి వివరించారు. పనుల్లో వేగంగా పెంచాలని అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు ఇచ్చారు. ఈపరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్‌సీ హరిరామ్, ఎస్‌ఈ వేణు తదితరులు పాల్గొన్నారు.