మెదక్

కోమటిచెరువు కట్టపై మంత్రి మార్నింగ్ వాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 23 : సిద్దిపేట జిల్లా కోమటిచెరువుమినీ ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేసి చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులను పరిశీలించారు. సుందరికరణ పనులుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కంట్రాక్టర్లను ఆదేశించారు. కోమటిచెరువుకు వచ్చే దారిలో ముఖద్వారాలు, రాక్ గార్డెన్, కామన్ ఫాంటెన్, స్పీంకర్లు, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయించేలా వారితో ఎప్పటికప్పుడు సమీక్షించాలని మున్సిపల్ చైర్మన్ రాజనర్సుకు సూచించారు. హైదరాబాద్ దుర్గం చెరువు తరహాలో కోమటిచెరువు గేట్ ముఖద్వారం చేయించాలని అధికారులను సూచించారు. చెరువు కట్టపై ఇంకా చేపట్టిల్సిన సుందరీకరణ పనులు గురించి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అదే విధంగా మున్సిపల్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్, ఏఈ రవీలతో పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
జిల్లా ఆసుపత్రి రహదారి నిర్మాణానికి తుదిమెరుగులు
సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న యూజీడీ పనుల దృష్ట్యా ఇబ్బందులను రోడ్లు దెబ్బతినటంతో ఆసుపత్రికి వచ్చే రహదారిని మంత్రి హరీష్‌రావు దృష్టి సారించి త్వరగా రోడ్డు నిర్మాణం చేయాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి నుండి ముస్తాబాద్ రోడ్డు వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ తుది దశ పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ముస్తాబాద్ సర్కిల్ అభివృద్ధిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ ప్రాంతమంత కలియ తిరిగి, స్థానిక దుకాణ సముదాయాలను పరిశీలించారు. సర్కిల్ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్, ఆర్‌అండ్‌భి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అంతకు ముందు కోమటిచెరువు కట్టపై ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఐటమ్స్‌ను పరిశీలించారు.