మెదక్

సాక్షరభారత్‌ను నిర్వీర్యం చేసేందుకు సర్కార్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూన్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సాక్షరభారత్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతోందని, అయితే కాంగ్రెస్ జన్మనిచ్చిన ఈ పథకాన్ని కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధమని రాష్ట్ర కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లోని టీవైఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సాక్షరభారత్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 50వేల మంది సాక్షర భారత్ కుటుంబసభ్యులతో త్వరలోనే హైదరాబాద్ ముట్టడి నిర్వహించి సర్కార్ కళ్లు తెరిపిస్తానని స్పష్టం చేశారు. కాగా గజ్వేల్ నుండే టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేక ఉద్యమాలకు పురిటిగడ్డ గా మారుతున్నందున ఇక్కడి నుండే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వీరి పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తుండగా, కేవలం రూ. 2వేల గౌరవ వేతనంతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న సర్కార్‌కు గుణపాటం తప్పదని హెచ్చరించారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే బంగారు తెలంగాణ సాద్యపడుతుందని కేసీఆర్ భావించకపోవడం సిగ్గుచేటు కాగా, ప్రజలు తెలివైనవారైతే తమ ఆటలు సాగవని ఆయన భయమని ఎద్దేవా చేశారు. వయోజనులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే సాక్షరభారత్ సిబ్బంది సమస్యలు పరిష్కరించడంతోపాటు రూ. 10వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే రెగ్యులరైజ్ చేస్తూ సమానపనికి సమానవేతనం ఇస్తామని చెప్పారు. జీఓలు 203, 80, 71లు సాక్షరభారత్ సిబ్బంది కాంట్రాక్ట్ సిబ్బందిగా సూచిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ఎంతమాత్రం తగదని నిలదీశారు. లిక్కర్‌తో ఖజానాను నింపుకుంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయగా, టీఆర్‌ఎస్ చర్యలను ఎండగడుతున్న క్రమంలో తనపై 43 కేసులు నమోదు చేసి జైలుపాలు చేసిన వారు ఎంతటి వారైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలు, రైతులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సమస్యలు పరిష్కరించకపోగా, ఆ కోవలోకే సాక్షరభారత్ సిబ్బంది చేరుకుంటున్నట్లు ఆరోపించారు. అధికారం కోసం అవినీతి సొమ్ముతో ప్రజాప్రతినిదులను కొనుగోలు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, ఖూనీ చేస్తోందని ఆరోపించారు. అలాగే మృతి చెందిన సాక్షరభారత్ ఉద్యోగి అశోక్‌కు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షరభారత్ రాష్ట్ర అధ్యక్షులు సురేశ్, జిల్లా అధ్యక్షులు సంతోష్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు సర్దార్‌ఖాన్, లక్ష్మారెడ్డి, ఆర్కె శ్రీనివాస్, భూమయ్యయాదవ్, సీఐటీయూ కార్యదర్శి రేవంత్‌కుమార్, అమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త జయరాంరెడ్డి, సాక్షరభారత్ జిల్లాల ప్రతినిదులు శ్రీనివాస్, తిరుమలేష్, సుదీర్‌కుమార్, సంఘమేశ్వర్, అశోక్, రమాదేవి, స్వామి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.