మెదక్

ఠారెత్తిస్తున్న సూర్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఏప్రిల్ 29: ఎండలు తీవ్రరూపం దాల్చాయి. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. శుక్రవారం 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 28.6 నమోదు అయినట్లు మెదక్ డివిజన్ ఇరిగేషన్ శాఖ వాతావరణ పరిశీలకులు రాములు తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా పశువులకు పశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నల్లవాగులో పశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పశువులకు నీళ్లు, మేత, నీడ దొరకుతుంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలానికి 30 నుండి 40 వేల ట్రాన్స్‌పోర్టు క్రింద మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్ల ఎర్తింగ్‌కు నీళ్లు పెడుతున్నట్లు మెదక్ డివిజన్ విద్యుత్ శాఖ ఇంజనీర్ వెంకటరత్నం తెలిపారు. మెదక్ డిపో బస్టాండ్ సమీపంలో మరో అంబలి కేంద్రాన్ని ధరణి ఫొటోస్టూడియో యజమాని మధు, ఉదయం మెజిస్ట్రేట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ రెండు అంబలి కేంద్రాలలో అన్ని వర్గాల వారు అంబలి తాగడం కనిపించింది. కలెక్టర్ పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలు కొన్ని చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి. ఉదయం 9 గంటల నుండే భానుడు భగభగమంటున్నాడు. ఆ సమయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజలు భయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఉపాధి హామీ కూలీలు కూడా ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకే పనిచేసుకోవాలని, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పనులు నిర్వహించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండదెబ్బ వలన రోజుకు చాలా మంది మరణిస్తున్నారు. మే నెలలో చెడగొట్టు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు శాస్తజ్ఞ్రులు చెబుతున్నారని ప్రజా ప్రతినిధులు తెలుపుతున్నారు. వర్షాల కోసం మనుషులు, పశువులు, పక్షులు ఎదురుచుస్తున్నాయి. భగవంతుడు కరుణిస్తే ఈ కరువు వాతావరణం నుండి బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజులు మంచి రోజులని, సంతలలో పశువులను అమ్ముకోవద్దని వెటర్నిటీ డాక్టర్లు రైతులకు సూచిస్తున్నారు. ఇలాంటి కఠోరమైన కరువు మరెప్పుడు చూడలేదని జిల్లా పశుసంరక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు.