మెదక్

రైతు సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దశంకరంపేట, ఏప్రిల్ 30: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి సల్పుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయా గ్రామాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు నిదర్శనంగా గతంలో ఎన్నడులేని విధంగా రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత తెరాస ప్రభుతావనిదే అన్నారు. ఏప్రిల్ 15 నుండి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయడం తమ ప్రభుత్వ ఘనత అన్నారు. అలాగే రైతులు పండించిన పంటకు నాణ్యమైన మద్దతు ధర అందిస్తున్నామన్నారు. రైతులు దళారుల భారీన పడకుండా ఉండేందుకు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అలాగే పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. ఇంత కాలం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో మార్కెట్ యార్డు లేదని, నేడు మండల కేంద్రమైన పెద్దశంకరంపేటతో పాటు నారాయణఖేడ్‌లో కూడా మార్కెట్‌యార్డు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకున్నా రైతులకు ఇన్‌పుడ్ సబ్సిడి ప్రభుత్వం విడుదల చేసిందని, అలాగే 3వ విడత క్రింద రైతు రుణమాఫిలు బ్యాంకులకు అందుతాయన్నారు. అలాగే రైతులు పండించిన పంటలకు ధర వచ్చేంత వరకు భద్రత కొరకు గిడ్డంగుల నిర్మాణం కూడా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ విగ్రం రామాగౌడ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, ఎంపిటిసి సభ్యులు మాణిక్యరెడ్డి, వేణుగోపాల్‌గౌడ్, సుభాష్‌గౌడ్, సర్పంచ్‌లు జంగం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.