మెదక్

ప్రమాదాలపై ప్రజాచైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, ఏప్రిల్ 30: రోడ్డు దాడుతుంటే..వాహనంపై వెళ్తుంటే..ఇలా కాలినడకన వెళ్లినా వాహనంపై వెళ్లినా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రణాలు కోల్పోవడం పెరిగిపోతున్న ట్రాఫిక్ యుగంలో సర్వసాదారణమైంది. జరుగుతున్న ప్రమాదాలతో కుటుంబ పెద్దను కోల్పోయి వీధిపాలవుతున్న కుటుంబాల దుస్తితి వర్ణనాతీతంగా మారాయి. ఎలాగైనా ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నా పూర్తిస్థాయి ఉపశమనం మాత్రం కలగడంలేదు. ప్రమాదాల నివారణ సమాజంలోని వారందరిపై ఉందన్న భావన ప్రజల్లో కల్పించేందుకు జిల్లా ఎస్పీ.సుమతి వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించారు. సమాజానికి కొంత సమయాన్ని కేటాయించి మహిళలను గుర్తించి వారి సేవలను వినియోగించాలని నిర్ణయించారు. రోడ్డు సేఫ్టీ ఇనిషియేటర్స్‌గా కొంతమందిని గుర్తించి వారికి దృవపత్రాలు అందజేశారు. వీరికి ప్రమాదాల నివారణకోసం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు నిర్వహించి అవగహన కల్పించారు. సేఫ్టీ బృందం సభ్యులకు పోలీసులు తమ మద్దతునిచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వారాని ఒక్కసారి లేక నెలకు రెండు సార్లు తమ వీలునుబట్టి ప్రమాదాల నివారణకోసం కార్యక్రమాన్ని చేపడతారు. ప్రధానంగా వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి నిర్లక్ష్యాలను సభ్యులు గుర్తించి వారిలో అవగహన కల్పించనున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికుల్లో చాలామంది హెల్మెట్ లేకపోవడంతోనే ఎక్కువ మంది చనిపోయారని ప్రభుత్వాలు గుర్తించారు. హెల్మెట్ ధరించేలా పోలీసులు అనేక రకాలుగా ప్రయాణికుల్లో అవగహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ ఆశించినమేర ఫలితాలు దక్కడంలేదని పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరన్నది సమాజంనుంచి వచ్చినప్పుడే మరణాల సంఖ్య తగ్గేఅవకాశాలున్నాయని గుర్తించారు. అందువల్ల సమాజంలో సేవాదృక్పథం ఉన్న మహిళలను ఇందుకోసం వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సంకల్పించారు. రోడ్డుసేఫ్టీ ఇనిషియేటర్స్‌గా వారిని గుర్తించి వారి సేవలు వినియోగించుకోనున్నారు. వీరు తమ ప్రాతంలోని ప్రమాద జోన్ పరిధిలో వారానికోసారి లేక నెలకు రెండుసార్లు ప్రమాదాల నివారణకోసం ప్రయాణికుల్లో అవగహన కల్పిస్తారన్నారు. గతంలో ప్రమాదాల నివారణకోసం ప్రత్యేక వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ శాఖల పరంగా, ఇతర సదస్సుల పరంగా అవగహన కల్పించడంతోపాటు రహాదారిపై పూలిచ్చి, బొట్లుపెట్టి రోడ్డు భద్రతలపై అవగహన కల్పించారు. కొంతమేర అవి ఫలితాలనిచ్చినా పూర్థిస్థాయిలో ఫలించలేదు. ఈ బృందాల సభ్యులు వాహనాలు వేగంగా నడుపుతున్నవారిని, హెల్మెట్ లేని వారిని, వాహనాలు నడుపుతున్న చిన్నపిల్లలను గుర్తించి వారిలో రోడ్డు భద్రతపై అవగహన కల్పిస్తారు. జరుగనున్న ప్రమాదాలు వాటి ఫలితాలపై వారిని చైతన్య పరుస్తారు. భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితాన్ని నష్టపోయి, తమపై ఆధారపడ్డవారి జీవితంలో చోటుచేసుకోన్ను పెనుముప్పు గురించి వివరించనున్నారు. తమ భర్తలు, పిల్లలు బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా హెల్మెట్ తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకునేలా మహిళలను ఈ బృందం సభ్యులు చైతన్యపర్చనున్నారు. అదేవిధంగా మద్యం మత్తులో డ్రైవింగ్, సీట్‌బెల్టు పెట్టుకోక పోవడంతో జరిగే ముప్పుపై కూడా వాహనదాలుల్లో చైతన్యం కల్పించనున్నారు. జిల్లా పోలీసులు ప్రమాదాల నివారణ ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తూ ప్రమాదాల నివారణకై తమవంతు సహాకారం అందిద్ధాం.