మెదక్

కసరత్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూలై 20: పాత గ్రామపంచాయితీ ప్రకారం లక్ష మొక్కల నర్సరీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మండల ప్రత్యేకాధికారులకు సూచించారు. శుక్రవారం హరితహారం, స్వచ్చ భారత్ కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు., ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున నర్సరీ ఏర్పాటుకు ఇప్పటి నుండే కసరత్తు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో స్థానిక ప్రజల అవసరాలకు, అభిరుచులను పరిగణలోకి తీసుకొని నర్సరీలో ఆ మొక్కలకు స్థానం కల్పించాలన్నారు. పాత పంచాయితీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని డీపీఓ హనుక్‌కు సూచించారు. ప్రతి నర్సరీలో అన్ని రకాల మొక్కలు పెంచాలని, విత్తనాల సేకరణ నాణ్యతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎఫ్‌ఓ పద్మజారాణికి సూచించారు. నాల్గవ విడత హరితహారంలో మొక్కలకు గుంతలు తీయడం, మొక్కలు నాటడం ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రత్యేకాధికారులు హరితహారం విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. మొక్కలు ఎలా నాటాలి, సంరక్షణ చర్యలకు సంబంధించి కరపత్రాలు విడుదల చేయాలన్నారు. మెదక్ పట్టణంలోని చర్చి హనుమాన్ దేవాలయం, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, హాస్టళ్లలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణంలో కొంత మందికి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదులు వస్తున్నాయని డీఆర్‌డీఓ నుండి మండలాల వారిగా జాబిత అందజేస్తారని, పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. స్వచ్చ సర్వేక్షణ గ్రామానికి 2018 కార్యక్రమ నిర్వాహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ సీతారామరావు, డీఎఫ్‌ఓ పద్మజారాణి, ఈఈ ఏసయ్య, డీసీఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నగేష్, బీసీడబ్ల్యూఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.