మెదక్

చొక్కాలు చించుకున్న గులాబీ దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాల్‌కల్, జూలై 20: జెండా పండుగ వేదికగా ఒకే పార్టీకి చెందిన సర్పంచులు, నాయకుల మధ్యన దాడులు చోటుచేసుకున్నాయి. గులాబి దండు సభ్యులు పర్పరం చొక్కాలు చించుకుని రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. జెండా దిమ్మె తమ గ్రామ పరిధిలోకి వస్తుందంటే తమ గ్రామంలోకి వస్తుందని పేర్కొంటూ మిర్జాపూర్ సర్పంచ్ జాహెదాబేగం తనయుడు షఫీ, ఖలీల్‌పూర్ సర్పంచ్ గోపాల్‌లు వారి మద్దతు దారులతో కలిసి పరస్పరం దూషించుకుంటూ కర్రలు, రాళ్లుతో దాడులు చేసుకున్నారు. న్యాల్‌కల్ మండల పార్టీ పరిశీలకులు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రామ్‌రెడ్డి రేజింతల్ గ్రామంలో జెండా పండగ ముగించుకుని మిర్జాపూర్ చేరుకున్నాడు. ఇక్కడ జెండా పండుగ నిర్వహిస్తుండగా పరస్పరం వారు దూషించుకుంటూ దాడులకు తెగబడ్డారు. కూర్చుని మాట్లాడుకుందామని ఆయన ఎంత సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురుని వారు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ పరిశీలకుని సమక్షంలోనే ఒకే పార్టీకి చెందిన రెండు గ్రామాల ప్రతినిధులు, గ్రామస్థులు ఘర్షణ పడటంపై మండలంలో వాడివేడిగా చర్చజరుగుతోంది. ఖలీల్‌పూర్, మిర్జాపూర్ గ్రామాల మధ్యన పలు అంశాల్లో కొంత కాలంగా వివాదం చోటుచేసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎండీ.్ఫరీదుద్ధీన్ సమక్షంలో ఎంపీపీ సమావేశ మందిరంలోనే వీరిరువురు ప్రభుత్వాసుపత్రి బోర్డు విషయమై గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏ గ్రమానికి చెందిన సర్వేనెంబర్‌లో ఆసుపత్రి ఉంటే వారికే చెందుతోందని లోగడ స్పష్టంచేశారు. అయినా ఈ సమస్య సద్దుమణగలేదు. నివురు గప్పిన నిప్పులా నలుగుతున్న సరిహద్దు సమస్య జెండా పండుగ సందర్భంగా గుప్పుమంది. ఇప్పటికైనా పార్టీ సమన్వయ కమిటి సభ్యులు, నియోజకర్గం పెద్దలు చొరవ తీసుకుని సరిహద్దు సమస్యను వెంటనే పరిష్కరించాలిని, ఇరు గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఈ దాడుల్లో గాయపడిన వారిలో మిర్జాపూర్‌కు చెందిన అబ్దుల్ రషీద్, వసియోద్ధీన్, ఖాజా, ఖలీల్‌పూర్‌కు చెందిన విఠల్‌రెడ్డి, గోపాల్, ఉప్పరి సీనులున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిర్వహించారు.