మెదక్

కేసీఆర్‌ది నియంతృత్వ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ టౌన్, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పూర్తిగా నియంతృత్వ ధోరని తలపిస్తుందని, అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటినా కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజలను మాటలతో నమ్మించడమే కాకుండా ఎన్నికల హామీలను నూటికి నూరు శాతం చేశామని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, హామీలను కనుక నెరవేర్చకుంటే సీపీఐ ఆధ్వర్యంలో మిలిటెంట్ ఉద్యమానికి సిద్ధం అవుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకై సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఎడ్లగురువారెడ్డి భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ముట్టడి చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రంను జేసీ పద్మాకర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సందర్భంగా చేసిన హామీలు, ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా ఇప్పటికి అమలుకు నోచుకోలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి 90శాతం కూడ పంచలేదనీ, పేదలకు డబుల్ బెడ్‌రూంలు కూడ కట్టించలేదని, ఇప్పటికి పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు రాక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఆసరా ఫించన్లు ఇవ్వకుండా అధికార పార్టీ వాళ్లకు ఇస్తున్నారని, రాష్ట్రం అంతటా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతుంటే రాష్ట్రప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైన ప్రజాసంక్షేమాన్ని కోరి ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ దోరనికి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలో మిలిటెంట్ పోరాటాలకు సిద్దం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్టక్రంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అయిలయ్య, దయానందరెడ్డి, మల్లేశ్, మచ్చ శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, బన్సీలాల్, అశోక్, హన్సిరెడ్డి, అంజయ్య, జనార్ధన్, మనె్నకుమార్, శంకర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు సుధాకర్, నరేష్, రాజు, రమణాకర్, శేఖర్, లింగం, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.