మెదక్

మేధోశక్తిని మించిన ఆయుధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, ఆగస్టు 13: నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని, వారి మేధోశక్తితోనే అణచివేతను అధిగమించవచ్చని మిస్ వరల్డ్ అమెరికా 2017 క్లరిస్సా బోవర్స్ సూచించారు. మేధో శక్తిని మించిన ఆయుధం లేదని, మానసిక సంపదే వారిని అగ్ర స్థానంలో నిలుచోబెడుతుందని ఆమె పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ క్యాంపస్‌లో ఆమె పర్యటించారు. మానసిక సంపద అంశంపై క్యాంపస్ విద్యార్ధినిలకు అవగాన కల్పించారు. ఈ సందర్భంగా బోవర్స్ మాట్లాడుతూ అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఆడపిల్లలు ఇండిపెండెంట్‌గా జీవిస్తారని, అలా అక్కడి చట్టాలను తయారు చేశారని అన్నారు. భారతదేశ స్ర్తిలు దేనికి తక్కువ కారని, ఇక్కడి వారు వారి శక్తిని ఉపయోగించుకోలేక పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే స్థాయి నుంచే ఆడపిల్లల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మానసిక వికాస సబ్జెక్టులపై మక్కువ పెంచుకుంటే, సమస్యలపై నియంత్రణ అలవడుతుందని తెలిపారు. చదుకునే ప్రతి ఆడపిల్ల మెంటల్ స్కిల్స్‌పై అవగాహన కలిగి ఉండి, పెంపొందించుకోవాలని దానికి విద్యాలయాలు కూడా సహకరించాలని కోరారు. యువతులకు మానసిక దృఢత్వానికి మించిన శక్తి ఇంకొకటి లేదని, వారి కాళ్లపై వారు అన్ని రంగాల్లో నిలబడేలా శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణ క్యాంపస్ యాజమాన్యం, 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.