మెదక్

రైతే రాజు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, ఆగస్టు 14: రైతులు రాజులు కావాలని అందోల్ శాసనసభ్యుడు బాబుమోహన్ అన్నారు. మంగళవారం అందోల్ మండలం నాగులాపూర్ గ్రామంలో రైతుబాండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి క్రింద నగదు రూపంలో రైతులకు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతి రైతుకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ముద్ర పడినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, నాయకులు జహంగీర్‌రెడ్డి, లింగన్న, అశోక్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

బీమాతో రైతు కుటుంబాలకు ధీమా
* ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

హత్నూర, ఆగస్టు 14:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకంతో రైతుల కుటుంబాలకు దీమా ఏర్పడిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చింతల్‌చెరువు, కొత్తగుడెం గ్రామాలలో రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఈ బీమా కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల కో ఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, వైస్ చైర్మన్ అక్బర్, తాజామాజీ సర్పంచ్ మాదవి రమేష్‌నాయక్, రాములు, అర్జున్, నరేందర్, అశోక్, మెరాజ్, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాసాలలో గాంధీజీ విగ్రహావిష్కరణ
మండలంలోని కాసాల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు గాంధీజీ చూపిన బాటలో అహింసా మార్గంలో నడవాలని అన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.