మెదక్

మల్కాపూర్‌కు ముఖ్యమంత్రి చేసిందేమీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఆగస్టు 14: మల్కాపూర్ గ్రామానికి గ్రామస్థులే 3 సంవత్సరాలుగా కష్టపడి అభివృద్ధి చేసుకున్నారని ముఖ్యమంత్రి చేసిందేమీలేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, రాష్ట్రం రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి ఆయనే కుర్చీలో కూర్చున్నారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మొదలగు పథకాలు ఎక్కడ అమలవుతున్నాయని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీని విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, నేను ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఓడిపోతే పార్టీని రద్దు చేస్తారా అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు కృష్ణారెడ్డి, చక్రవర్తి, సత్యనారాయణ, అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘దేశానికి ఆదర్శం ముఖ్యమంత్రి కేసీఆర్’
తూప్రాన్, ఆగస్టు 14: దేశంలో ఎక్కడా అమలుకాని పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రి అయ్యారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మల్కాపూర్‌ను సందర్శించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. కంటి వెలుగు దేశంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదని మల్కాపూర్‌లో ప్రారంభించడం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బీసీలకు రుణాల పంపిణీ, ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. విలేఖరుల సమావేశంలో శేఖర్‌గౌడ్, పెంటాగౌడ్, సత్తార్, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సీఎం రాకతో రాత్రికి రాత్రే రోడ్డు
తూప్రాన్, ఆగస్టు 14: ముఖ్యమంత్రి మల్కాపూర్ పర్యటనకు వస్తున్న సందర్భంగా మల్కాపూర్ నుండి గుండ్రెడ్డిపల్లి వరకు అడవిలో రోడ్డును ఆగమేగాల మీద కంకర, బీటీ రోడ్డును వేశారు. మల్కాపూర్ అడవి నుండి గుండ్రెడ్డిపల్లి గ్రామానికి కిలోమీటర్ రోడ్డును గత 50 సంవత్సరాలుగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో అలాగే ఉంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా రాత్రికిరాత్రి రోడ్డును వేశారు. ఈ రోడ్డును వేయడంతో తూప్రాన్ నుండి మల్కాపూర్ వెల్లే ప్రజలకు 3 కిలోమీటర్లు తగ్గుతుంది. ఆగమేగాల మీద రోడ్డు వేయడంతో ఎన్నాళ్లు ఉంటుందోనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.