మెదక్

శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్టు 20: శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం సహించేదిలేదని, పెండింగ్ కేసులను సత్వర పరిష్కారం చేయాలని పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోలీసు అధికారుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆస్తికి సంబంధించిన కేసులలో నేరస్తుల ఆచూకీ గుర్తించి కేసులను త్వరితగతిన శోధించి ప్రాపర్టీని రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అవసరమని, ఆస్తికి సంబంధించిన నేరాలలో టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా అమలు చేయాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని, కేసులను టార్గెట్‌గా పెట్టుకొని యూఐ కేసులు తగ్గించాలని, సీసీ నెంబర్ పెండింగ్ లేకుండా కోర్టు అధికారులతో సమన్వయం చేసుకోవాలని, కాంప్రమైజ్ అయ్యే కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా అక్టోబర్ చివరిలోగా కమిషనరేట్ పరిధిలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసి సేఫ్ కమిషనరేట్‌గా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అయితే సీసీ కెమెరాల ఏర్పాటుపై అన్ని స్థాయిల పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, నెల రోజులలో మిరుదొడ్డి, కొమురవెల్లి, చేర్యాల, మర్కూక్, తొగుట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం పనిచేస్తుండగా, ప్రజా ఫిర్యాదులలో జాప్యం చేయకుండా వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గుట్కా, పేకాట, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై దాడులు ముమ్మరం చేయాలని, పోలీసు గస్తీ, పెట్రోలింగ్ బ్లూకోడ్స్, నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ నేరాలను తగ్గుముఖం పట్టించేందుకు దృష్టి సారించాలని చెప్పారు. విలేజ్ ఆఫీసర్స్‌తో ఇంటిలిజెన్స్ సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలను వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని, ప్రతి రెండుమూడు రోజులకోసారి గ్రామాలను పోలీసు అధికారులు క్రమం తప్పకుండా సందర్శించాలని, 5ఎస్ విధానం తప్పకుండా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రభాకర్, నర్సింహారెడ్డి, ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, సీఐలు ప్రసాద్, శివ లింగం, సైదులు, శ్రీనివాస్, నిరంజన్, దయాకర్‌రెడ్డి, పరశురాములు, శ్రీనివాస్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

పనిచేయని కాంట్రాక్టర్లను తొలగిస్తాం
* ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
తూప్రాన్, ఆగస్టు 20: మంజూరైన పనులను కాంట్రాక్టర్లు నత్తనడకన చేయడంపై వారిని తొలగించి వారి స్థానంలో వేరే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరు కాంట్రాక్టర్లు సమావేశానికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్థిక స్తోమత కలిగిన కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మనోహరాబాద్ గ్రామానికి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించకపోవడంతో వెంటనే పూర్తి చేయాలని పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు తెలిపారు. మొత్తం పని పూర్తయ్యాకనే డబ్బులు ఇస్తాం కానీ మధ్యలో డబ్బులు ఇచ్చేదిలేదు. ఆర్థిక స్తోమత కలిగిన కాంట్రాక్టర్లే పనులు చేయాలని తెలిపారు. అధికారుల నుండి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలని మీ పనులకు అడ్డంకులుగా ఉన్న సమస్యలను అధికారులు తొలగిస్తారని తెలిపారు. కాళ్ళకల్, అచ్చాయపల్లి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఒక వ్యక్తి భూ యజమాని కోర్టు కేసు వేయగా, ఆ స్థలాన్ని వదిలి మిగితా స్థలంలో పనులు చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. తూప్రాన్‌లో ఆర్టీసీ బస్టాండ్, వేసైడ్ మార్కెట్, మార్కెట్‌యార్డు, మున్సిపల్ భవనం, డంప్‌యార్డు, స్మశానవాటిక, డంప్‌యార్డు పనులను స్పీడ్ పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.