మెదక్

ప్రశ్నిస్తే అరెస్టులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, ఆగస్టు 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం నిధులు పక్కదారి పట్టిస్తూ విద్యార్థుల పట్ల నిర్లక్ష వైఖరి సాగిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం సిద్దిపేటలో ఆర్డీఓ కార్యాలయాన్ని సమరభేరి సైకిల్ యాత్ర సందర్భంగా తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌తో ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరవింద్ మాట్లాడుతూ గతనెల జూలై 26న ప్రారంభమై ఆగస్టు 4వ తేదీని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సమరభేరి సైకిల్‌యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. యాత్రలో సిద్దిపేటలోని స్కూల్, కళాశాల, హాస్టల్స్ సందర్శించిన సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని ఆధికారులను ప్రశ్నించడానికి వెళ్తే పోలీసులు అక్రమంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అమ్మాయిల హాస్టల్స్‌లో ఎంబీబీఎస్ డాక్టర్ కేటాయించి కనీసం నేలకు ఒకసారైన మెడికల్ చెకప్ జరగడం లేదన్నారు. కులాల పేరిట విద్యార్థులకు ఇస్తున్న వార్డెన్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అక్రమంగా విచ్చలవిడిగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నియంత్రణ దాఖలాలు లేవన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిఫ్, ఫీజు రీయంబర్స్‌మెట్స్ 4వేల కోట్లు విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ నిధులను దారి మళ్లిస్తుందన్నారు. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, మధు, నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్, రాజు, భరత్, సోహెల్, భాస్కర్. సంజు తదితరులు పాల్గొన్నారు.