మెదక్

డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆద్శరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 20: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం దేశానికే ఆదర్శమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రతి పేదవాడు సొంత ఇంటితో ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం ఫసల్‌వాది చౌరస్తా వద్ద గల సర్వే నంబర్ 599లో 325 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో ఇండ్లను కేటాయించి సరిపడ నిధులు కేటాయించకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోవడంతో పాటు పెద్ద అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారిగా పని చేస్తుందన్నారు. నియోజకవర్గంలో రూ.76కోట్ల 75లక్షలతో 1400 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, డిసెంబర్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫసల్‌వాది శివారులో నిర్మించే 325 ఇళ్ల నిర్మాణాల్లో సంగారెడ్డి పట్టణానికి సంబంధించి 265, ఫసల్‌వాది 45, కులబ్‌గూర్‌కు 20 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. నిర్మించే ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నామని, విద్యుత్, రోడ్లు, డైనేజ్ తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గానికి 1400 ఇండ్లను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరమళ్ళ నర్సింలు, నాయకులు రాజేశ్వర్‌రావుదేశ్‌పాండే, కొండల్‌రెడ్డి, మానిక్యం, విఠల్, చిల్వెరి ప్రభాకర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.