మెదక్

గజ్వేల్ ప్రజల పరువు తీస్తున్న కాంగ్రెస్ నేత ప్రతాప్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 17: దేశంలోనే గజ్వేల్ ఆదర్శంగా నిలుస్తుండగా, కాంగ్రెస్ నేత ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గజ్వేల్ పరువు తీస్తున్నారని రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెడుతున్న గజ్వేల్ 50 యేండ్ల ముందుంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుండగా, ఆయనను విమర్శిస్తే ప్రజలు క్షమించరని సూచించారు. ముఖ్యంగా అభివృద్ధికి కలసివస్తే నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకోవడం ప్రతాప్ రెడ్డికి ఎంతమాత్రం తగదని, ఇప్పటికే రూ. 10వేల కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్న విషయాన్ని గమనించాలని కోరారు. ప్రతాప్‌రెడ్డి కంటే ఎంతో సీనియర్‌నైన నేను తెలంగాణ ఉద్యమంలో 22 రోజుల పాటు జైలు జీవితం అనుభవించగా, అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుండడం సిగ్గుచేటని నిలదీశారు. ఇక్కడి నుండి సీఎం కేసీఆర్ ప్రాతినిత్యం వహించడం గజ్వేల్ ప్రజల అదృష్టం కాగా, సమైఖ్య వాది చంద్రబాబు తోక పార్టీతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తానని కలలు కంటున్నట్లు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఢీకొట్టడం ఎవరి తరం కాదని, ఊహించని మెజార్టీతో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొంది తిరిగి సీఎం కావడం ఖాయమని తెలిపారు. గజ్వేల్ అభివృద్ధి కనిపిస్తుండగా, మతి స్థిమితం కోల్పోయినట్లుగా మాట్లాడడం సమంజసంగా లేదని, అయితే అభివృద్ధిపైచర్చకు వస్తే ఆదారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అభివృద్దికి కలసిరాని పక్షంలో కష్టాలు కొనితెచ్చుకోవద్దని ఆయన బండారం బయటపెడతామని వివరించారు. ఈ సమావేశంలో నేతలు ఎన్‌సీ రాజవౌళిగుప్త, రుక్కారెడ్డి, నర్సింగరావు, రఘువర్దన్‌యాదవ్, మల్లేషం, ప్రవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.