మెదక్

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీన్‌పూర్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ముందుకు సాగుతోందని పటన్‌చెరు మాజీ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి అన్నారు. ముస్లిం మైనార్టీలు రంజాన్, బక్రీద్ పర్వదినాలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా తన స్వంత నిధులతో ఈద్గా నిర్మాణం పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి అమలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అనంతరం తన స్వంత నిధులతో ముదిరాజ్ భవనానికి కూడా ఆయన శంఖుస్థాపన చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశానని రాబోయే ఎన్నికలలో సైతం తనకు మద్దతు పలికి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరోసా కల్పించారు. తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే గెలుపునకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేసారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పటన్‌చెరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని, ఆ పనులను పూర్తి చేయడం ఒక్క టీఆర్‌ఎస్‌కే సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చే సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ సభ్యులు మల్లేశ్, బాల్‌రాజ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.