మెదక్

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని సోమవారం ఎబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ముందు జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీలు వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు బీరయ్యయాదవ్ మాట్లాడుతూ భారత యూనియన్‌లో స్వతంత్ర దేశంగా వెలుగొందిన హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న విలీనం అయిందని తెలిపారు. మొదట విలీన దినోత్సవం జరపాలని తర్వాత విమోచన దినోత్సవం జరపాలని చెప్పిన కేసీఆర్ నేడు ఏ దినోత్సవాన్ని జరపకుండ తప్పుకోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహారాష్ట్ర,కర్నాటక రాష్ట్రాల్లో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే మన రాష్ట్రం ఓట్లకు కక్కుర్తిపడి నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బందేన్నగౌడ్, నాగేందర్, మల్లేశంగౌడ్, టీజేఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, శేఖర్, పోచయ్య, కళ్యాణ్, సంగమేశ్, విష్ణు, అంజద్, ఎబీవీపీ నాయకులు విష్ణువర్ధన్, సంగమేశ్వర్, స్వామి, సాయికృష్ణ, వీరారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మా ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కే * కాలనీ వాసుల ఏకగ్రీవ తీర్మానం
నంగునూరు, సెప్టెంబర్ 17: తెలంగాణ ఏర్పడ్డాకా మండలంతో పాటు తమ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన టీఆర్‌ఎస్ నేత మంత్రి హరీష్‌రావుకు జరిగే ఎన్నికల్లో తమ ఓటు వేస్తామని కాలనీ వాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సోమవారం నాడు నంగునూరు మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామం హనుమాన్ నగర్ కాలనీ వాసులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి ఆధ్వర్యంలో మా ఓట్లన్నీ హరీష్‌రావుకే నని ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దువుల మల్లయ్య, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, సోసైటీ చైర్మన్ రమేశ్, మండల రైతు సమన్వ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, నేతలు రవీంద్రాచారి, జయరాములు, భిక్షపతి, కోనేటి సత్యం, బెదురుతిరుపతి, బాలకిషన్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేష్, రాజు, విజయ్, యాదగిరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.