మెదక్

పేదల అభ్యున్నతే ధ్యేయంగా నిరంతరం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, సెప్టెంబర్ 17: పేదల అభ్యున్నతే ధ్యేయంగా నిరంతరం దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషిచేస్తానని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బండారుపల్లి మదిర మెట్టులో గ్రామస్థులంతా రామలింగారెడ్డికే ఓట్లేస్తామని ప్రతిన చేసి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజక వర్గానికి తాను చేస్తున్న అభివృద్ధికి ప్రజలు చేయూతనిచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని, అది గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మాణం చేయడం గొప్ప విషయమన్నారు. ప్రజలతో మమేకంమై వారి సంక్షేమమే ధ్యేయంగా తాను ప్రజలిచ్చిన దీవెనలతో రుణం తీర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో హన్‌మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

పస్తులుంటున్న ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు
4 నెలలుగా బడ్జెట్ విడుదల చేయని సర్కార్: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజు
గజ్వేల్, సెప్టెంబర్ 17: గజ్వేల్ ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాలకు సర్కార్ నిధులు విడుదల చేయకపోతుండడంతో విద్యార్థులు పస్తులుంటున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజు విమర్శించారు. సోమవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 3 పాలిటెక్నిక్ కళాశాలలుండగా, తెలంగాణాలో ఉన్న ఏకైక గజ్వేల్ ఆదర్శపాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి పాలకులు మర్చిపోతున్నట్లు విమర్శించారు. అయితే 4 నెలలుగా నిదులు విడుదల చేయకపోవడంతో 300ల మందికి పైగా వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, అప్పులు తెచ్చి యాజమాన్యం విద్యార్థులకు అరకొర ఆహారం అందిస్తున్నట్లు ఆరోపించారు. అలాగే కనీస అవసరాలు తీర్చకపోవడం, శిథిలావస్తకు చేరిన భవనాల్లో విద్యాబోదన జరుగుతుండడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం పట్ల గజ్వేల్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల అంటేనే బయపడుతున్నట్లు చెప్పారు.