మెదక్

విశ్వకర్మలు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, సెప్టెంబర్ 17: విశ్వకర్మలు అన్ని రంగాల్లో రాణించాలని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు బి.వెంకటేశ్వర్లుచారి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో విశ్వకర్మల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మలు భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. మంజీర గార్డెన్‌లో విశ్వకర్మ జయంతి ఉత్సవ సభను నిర్వహించారు. మొదటగా విశ్వకర్మ పూజ నిర్వంచించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు, మెదక్ పంచాయితీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లుచారి మాట్లాడుతూ సృష్టికి ప్రతిసృష్టి చేసిన వారే విశ్వకర్మలన్నారు. ఐదు కులాలతో ఏర్పడిన సమూహమే విశ్వకర్మ, నేటి సమాజంలో నవీన పోకడల మూలంగా వృత్తికి గడ్డు పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్మలు కలిసికట్టుగా, ఏకదాఠిపై ఉండి హక్కులను సాధించుకున్ననాడే సంఘం అభివృద్ధి బాటలో పయణిస్తుందన్నారు. పట్టణాల్లోనే కాక మండలాల్లో సైతం బంగారం దుకాణాలు ఏర్పడటంతో కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలకు దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన విశ్వకర్మలకు ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలకు రెండు పడకల ఇళ్లు, మూడు ఎకరాల భూమి అందించాలని, విశ్వకర్మల పిల్లల చదువులకు వేద పాఠశాలలు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ బలరాములు, విశ్వకర్మల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌చారి పాల్గొన్నారు.