మెదక్

పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 12: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ఆమోదించి జస్టీస్ ఉషామెహ్రాకమిషన్ నివేదికను అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శ బాబు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద మందకృష్ణ దీక్షకు మద్దతుగా చేపట్టిన రిలేదీక్ష 2వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించేలా సిఎం చొరవ తీసుకోవాలన్నారు. వర్గీకరణకు ప్రజాస్వామ్య డిమాండ్‌గా షెడ్యూల్ కులాల సమానతకై దేశంలో అన్ని జాతీయ, ప్రాంతీయ వర్గీకరణకు అనుగుణంగా లిఖితపూర్వకంగా లేఖలిచ్చారన్నారు. మాదిగల ఓట్లతో గద్దెనెక్కిన సిఎంలు, కేంద్ర ప్రభుత్వాలు తమపట్ల వివక్ష చూపుతున్నాయన్నారు. స్వచ్ఛ్భారత్ పేరుతో దేశంలో అసమానతలు తొలగిస్తామని అంబేద్కర్‌మీద ప్రమాణంచేసిన ప్రధాని మోదీ వర్గీకరణ పై సాత్సారం చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా వర్గీకరణ బిల్లు పెట్టి అమలుకోసం సిఎంలు ఢిల్లీకిపోయి కేంద్రం మీద ఒత్తిడి తేవాలన్నారు. వర్గీకరణ అమలయ్యేదాకా ఆందోళన చేస్తామన్నారు. ఈ దీక్షల్లో నేతలు బాబు, యాదగిరి, సింహాచలం, కిష్టయ్య, మల్లేశం, నర్సింలు పాల్గొన్నారు.

*